‘ఫైటర్’ ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ ఏరియల్ యాక్షన్

ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు హృతిక్ రోషన్. ‘సూపర్ 30, వార్, విక్రమ్ వేద‘ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఇప్పుడు ‘ఫైటర్‘ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇండియాస్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ మూవీగా ‘ఫైటర్‘ రూపొందింది. ఇప్పటికే హృతిక్ రోషన్ కి ‘బ్యాంగ్ బ్యాంగ్, వార్‘ వంటి హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్స్ అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలకాబోతున్న ‘ఫైటర్‘ నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజయ్యింది. అబ్బురపరిచే ఏరియాల్ యాక్షన్ విజువల్స్ తో ‘ఫైటర్’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎయిర్ డ్రాగన్స్ యూనిట్ లో పనిచేసే ఫైటర్ పైలట్ గా కనిపించబోతున్నాడు హృతిక్. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో హృతిక్ రోషన్ లుక్స్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి. 2019లో జరిగిన పుల్వామా అటాక్ ను ఈ సినిమాలో భాగం చేశాడు డైరెక్టర్ సిద్ధార్థ్. రియల్ ఇన్సిడెంట్స్ తో సాగే ఫిక్షనల్ డ్రామాగా ఈ మూవీని తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ మూవీతో హృతిక్, దీపిక పదుకొనె ఫస్ట్ టైమ్ జోడీగా నటించారు. ఇతర కీలక పాత్రలో అనిల్ కపూర్ కనిపించబోతున్నాడు.

Related Posts