సలార్ కు పెరిగిన బడ్జెట్.. ఇది ప్రభాస్ కు అవమానమేనా..?

ఒక సినిమా విజయం మరో సినిమా బడ్జెట్ ను డిసైడ్ చేస్తుంది అనేది సినిమా పరిశ్రమల్లో పాత మాటే. కానీ ఏ బడ్జెట్ అయినా.. తిరుగులేని కలెక్షన్స్ సాధించగల కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా బడ్జెట్స్ గత చిత్రాల విజయాలపై ఆధారపడి ఉన్నాయంటే అది ఖచ్చితంగా ఆ హీరోకు అవమానమే కదా.. ? ఎవరేమనుకున్నా ఇప్పుడు ప్రభాస్ కు జరిగింది ఇదే. యస్.. సౌత్ నుంచి ఫస్ట్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగింది ప్రభాస్. బాహుబలితో అతని క్రేజ్ దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో పెరిగిందో అందరికీ తెలుసు. పైగా ఇప్పుడు చేస్తోన్న సినిమాలన్నీ కూడా ప్యాన్ ఇండియన్ వే. కాకపోతే మధ్యలో రాధేశ్యామ్ పోయింది. అయినా అతని క్రేజ్, రేంజ్ తగ్గుతుందా.. అంటే తగ్గిందనే ఇన్ డైరెక్ట్ గా చెబుతోంది సలార్ ప్రొడక్షన్ హౌస్.

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సలార్ ఎప్పుడో షూటింగ్ ప్రారంభించుకుంది. రేపో మాపో టీజర్ కూడా ఇవ్వబోతున్నారు అంటున్నారు. ఇలాంటి టైమ్ లో సలార్ కు బడ్జెట్ మరింత పెంచుతున్నాం అనే మాట వినిపిస్తోంది. అంటే ఇప్పటి వరకూ మినిమం బడ్జెట్ తోనే ప్యాన్ ఇండియన్ స్టార్ తో సినిమా స్టార్ట్ చేశారు అనుకోవాలా..? లేక ప్రశాంత్ నీల్ కెజీఎఫ్2 కూడా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి.. అతనిపై నమ్మకంతో బడ్జెట్ పెంచుతున్నారు అనుకోవాలా? ఏది అనుకున్నా అది ప్రభాస్ కు అవమానమే కదా.. ? ప్రభాస్ పై నమ్మకం ఉంటే ఆ బడ్జెట్ ఆల్రెడీ కేటాయించి ఉండాలి. కానీ ఇప్పుడు పెంచుతున్నారు అంటే కేవలం ప్రశాంత్ నీల్ కేపబిలిటీ వల్లే అనుకోవాల్సిందే కదా..?
మరి ఈ విషయంలో మేకర్స్ వెర్షన్ ఎలా ఉంటుందో కానీ.. ప్రస్తుతం కెజీఎఫ్2 సక్సెస్ తర్వాత సలార్ కు బడ్జెట్ పెంచడం అనే మాట ప్రభాస్ ఫ్యాన్స్ ను కోపానికి గురిచేస్తోందనే చెప్పాలి.

Related Posts