Bellamkonda : కల చెదిరింది.. దూకుడు పెంచాడు

బెల్లంకొండ శ్రీనివాస్.. తెలుగులో మాస్ హీరోగానే ఎష్టాబ్లిష్‌ కావాలని ప్రయత్నిస్తోన్న హీరో. అందుకు తగ్గట్టుగా ఎంచుకుంటోన్న కథలను అతని కలను నెరవేర్చడం లేదు కానీ.. బాలీవుడ్ లో డబ్బింగ్ మార్కెట్ ను స్ట్రాంగ్ గా క్రియేట్ చేశాయి. శ్రీనివాస్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల కంటే హిందీ డబ్బింగ్ మార్కెట్ రూపంలోనే నిర్మాతలు లాభాలు చూసే పరిస్థితి ఉంది. దీంతో అక్కడి ఆడియన్స్ ను డైరెక్ట్ గా అట్రాక్ట్‌ చేయాలని ఛత్రపతితో హిందీ డెబ్యూ ఇచ్చాడు.

తన డబ్బింగ్ మార్కెట్ వల్ల ఓపెనింగ్స్ అయినా వస్తాయి అనుకుంటే అదీ లేకుండా పోయింది. ఎన్నో కలలతో తనను తెలుగులో హీరోగా పరిచయం చేసిన వివి వినాయక్ తోనే బాలీవుడ్ లో అడుగుపెడితే అక్కడ అతని కలలు కల్లలయ్యాయి. దీనికోసం చాలా టైమ్ వేస్ట్ చేసుకున్నాడు కూడా. బట్ కల చెదిరిపోవడంతో ఇక మళ్లీ తెలుగులో స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నాడు.


ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరక్షన్ లో సినిమాకు ఓకే చెప్పి ఉన్నాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది. దీంతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కూడా ఓకే చెప్పినట్టు టాక్. అది కూడా తన తమ్ముడు గణేష్ హీరోగా నటించిన నేను స్టూడెంట్ ను సర్ అనే మూవీతో దర్శకుడుగా పరిచయం అవుతున్న రాకేశ్ ఉప్పలపాటి దర్శకత్వంలో కావడం విశేషం. రాకేశ్ చెప్పిన కథ శ్రీనివాస్ కు బాగా నచ్చిందట. పైగా ఇది ఒలింపిక్స్ నేపథ్యంలో సాగే ఓ స్పోర్ట్స్ డ్రామా అట. అలాంటి కథలను తన బాడీ లాంగ్వేజ్ కుబాగా సూట్ అవుతాయని ఆ దర్శకుడితో తర్వాతి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని నిర్మించేది కూడా నేను స్టూడెంట్ ను సర్ నిర్మాతలే. నాంది చిత్రంతో నిర్మాతగా మారిన సతీష్‌ ఆ పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని నాంది సతీష్ అయ్యాడు. అతనే ఈ శ్రీనివాస్ సినిమాను కూడా నిర్మించబోతున్నాడట. మొత్తంగా బాలీవుడ్ డ్రీమ్స్ లో పడి చాలా టైమ్ వేస్ట్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మళ్లీ దూకుడు పెంచుతున్నాడన్నమాట.

Related Posts