NBK 108 : బాలయ్య కోసం ఫ్యాన్స్.. ఫ్యాన్స్ కోసం బాలయ్య ..

నందమూరి బాలకృష్ణ మూవీ అంటే కంటెంట్ కంటే ముందు టైటిల్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి. లేదంటే ఫ్యాన్స్ కు నచ్చదు. టైటిల్ తో మొదలయ్యే రచ్చ కంటెంట్ బావుంటే కాసులు కురిపించేలా చేస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ.

ఇలాంటి పాత్ర ఇప్పటి వరకూ బాలయ్య కెరీర్ లో చేయలేదు అనే టాక్ ఉంది. ఈ మూవీలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ లీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం వరుస హిట్స్ తో వున్న బాలయ్య ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు. అటు ట్రేడ్ లో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ ఏంటో అందరికీ రివీల్ చేశారు.


“భగవత్ కేసరి – ఐ డోంట్ కేర్” అనేదే బాలయ్య – అనిల్ రావిపూడి మూవీ టైటిల్ అని చెబుతున్నారు. టైటిల్ క్లాస్ గా ఉన్నా మాస్ కూ కనెక్ట్ కావడానికే ఈ ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారంటున్నారు. బట్ ఇది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ఒకవేళ టైటిల్ అదే అయితే బర్త్ డే రోజు టైటిల్ తో పాటు ఓ మాంచి మాస్ టీజర్ వదులుతారు. దీంతో పాటు మరో రెండు సర్ ప్రైజ్ లు కూడా బాలయ్య ఫ్యాన్స్ కోసం సిద్ధం చేస్తున్నారు.