MEGASTAR : భం భం భోళా శంకర్ అంటాడా

కలిసొచ్చిన బ్యాక్ డ్రాప్స్ సినిమాలంటే క్రేజ్ ఉంటుంది. దానికి కాస్త బలమైన కంటెంట్ కూడా ఉంటే ఇంక చెప్పేదేముందీ మంచి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అదే చేస్తున్నాడు. తన ఆల్‌ టైమ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన ఇంద్ర మూవీ మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి ఆ ఫ్లేవర్ లోనే కొత్త సినిమా ‘భోళా శంకర్”ను పరిచయం చేయబోతున్నాడట.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి రీమేక్ గా వస్తోన్న ఈమూవీలో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ కథ చాలా చోట్ల రీమేక్ అయింది. తెలుగులో డబ్ అయింది కూడా. అయినా చిరంజీవి మనసు పడ్డాడు. ఇక ఈ మూవీకి కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా లేని మెహర్ రమేష్ దర్శకుడు కావడం విశేషం. ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న భోళా శంకర్ ప్రమోషన్స్ ను మంచి జోష్‌గా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మేరకు భోళా మేనియా స్టార్ట్ కాబోతోందనే హింట్ కూడా ఇచ్చారు.


ఇక ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ లో లేని ఓ ఫ్లాష్ బ్యాక్ ను తెలుగులో పెట్టారట. ఆ ఫ్లాష్‌ బ్యాక్ కాశీ, వారణాసిలో జరుగుతుందట. అంటే ఇంద్ర సినిమా లొకేషన్స్ లో అన్నమాట. అంతే కాక ఈ చిత్రంలోనూ ఇంద్రలో ఉన్న ” భం భం బోలే” సాంగ్ ను పోలిన ఓ పాట ఉంటుందట. ఈ పాటలో మెగాస్టార్ స్టెప్పులు వింటేజ్ చిరును గుర్తుకు తెస్తాయి అంటున్నారు. దీంతో పాటు భోళా శంకర్ లో చేసిన మేజర్ ఛేంజెస్ లో కామెడీ కూడా ఒకటంటున్నారు.

చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా వచ్చిన వాల్తేర్ వీరయ్యలో కూడా ఆ టైమింగ్ తో అదరగొట్టాడు. భోళా శంకర్ లోనూ ఆ తర�