టాప్ గేర్ లో దూసుకుపోతోన్న డాక్టర్ పిల్ల

డాక్టర్ పిల్లశ్రీ లీల.. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అంతకు ముందే కన్నడలో రెండు సూపర్ హిట్ మూవీస్ లో యాక్ట్ చేసి ఉంది. వెరీ అట్రాక్టివ్ బ్యూటీ అనిపించుకున్న శ్రీ లీల తెలుగును రూల్ చేస్తుందని ఫస్ట్ మూవీలో చూసినవాళ్లంతా అనుకున్నారు. అలాగే తన ప్రాజెక్ట్స్ సెట్ అవుతున్నాయి. మొదటి సినిమా తర్వాత రవితేజ ధమాకా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మాస్ రాజా హైపర్ ను మ్యాచ్ చేసే గ్రేస్ ఈ బ్యూటీలో కూడా ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఆ తర్వాత తను డాక్టర్ చదవడానికి కొంత గ్యాప్ తీసుకున్నా.. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది.డాక్టర్ పట్టా కూడా తీసుకున్న ఈ యాక్టర్ .. నితిన్ సరసన వక్కంతం వంశీ డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెప్పింది. అనగనగా ఒక రాజు అనే సినిమాలో నవీన్ పోలిశెట్టితో రొమాన్స్ కూ సై అంది. అలాగే తెలుగు, కన్నడ బై లింగ్వుల్ గా రాబోతోన్న సినిమాలో తనే హీరోయిన్. ఈ మూవీతో గాలి జనార్ధన రెడ్డి తనయుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే..

ఉప్పెన స్టార్ వైష్ణవ్ తేజ్ తో మూవీకీ కమిట్ అయింది. అమ్మడి స్పీడ్ చూస్తోంటే రాబోయే రోజుల్లో కాబోయే టాప్ హీరోయిన్ అని ఎవరికైనా అనిపిస్తుందనే చెప్పాలి. వీటితో పాటు లేటెస్ట్ గా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందంటున్నారు.సూపర్ స్టార్ మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఇంతకు ముందు ఈ పాత్రను సంయుక్త మీనన్ చేస్తుందనే న్యూసూ వచ్చాయి. బట్ లేటెస్ట్ గా శ్రీ లీల అయితే బెటర్ అనుకుంటున్నారట. కానీ త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసిన భామలెవరూ తర్వాత ఫామ్ లో లేకుండా పోయారు. అదో బ్యాడ్ సెంటిమెంట్ అని కూడా చెప్పొచ్చు. మరి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ను రూల్ చేసేలాంటి ప్లానింగ్ తో ఎదుగుతోన్న ఈ సోయగం ఆ ఆఫర్ కు ఓకే చెబుతుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తంగా శ్రీ లీల దూకుడు ఇప్పుడున్న టాప్ హీరోయిన్లకు గుబులు పుట్టిస్తుందనే చెప్పాలి.

Related Posts