పవన్ కళ్యాణ్‌ ఇలా కూడా ట్రెండ్ సెట్ చేస్తాడా..?

ట్రెండ్ పాత హిట్ చిత్రాల టైటిల్స్ ను రిపీట్ చేయడం తెలుగులో కామన్ గానే చూస్తున్నాం. అయితే ఒకే హీరో సినిమా టైటిల్స్ రిపీట్ కావడం మాత్రం రేర్. ఆ రేర్ ట్యాగ్ ను సంపాదించుకున్న స్టార్ పవన్ కళ్యాణ్‌. యస్.. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ నటించిన తొలిప్రేమ టైటిల్ ను రిపీట్ చేస్తూ.. వరుణ్‌ తేజ్ ఓ మూవీ చేశాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ టైటిల్ తో సినిమా వస్తోంది. ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ టైటిల్ తో ఓ యంగ్ స్టార్ రాబోతున్నాడు. మరి ఈ టైటిల్ అతనికి ప్లస్సా మైనస్సా..?పవన్ కళ్యాణ్‌ పేరు చెబితేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. ఇక ఆయన సినిమాల టైటిల్స్ ను రిపీట్ చేస్తూ మరో హీరో సినిమా చేస్తే ఖచ్చితంగా వాళ్లూ ఆ మూవీ కోసం ఆసక్తిగానే చూస్తారు. అది ఓ రకంగా ఈ కొత్త సినిమాకు ప్లస్ అవుతుంది. అందుకే టాలీవుడ్ లో తనదైన ప్లేస్ కోసం ఫైట్ చేస్తోన్న అక్కినేని కుర్ర హీరో అఖిల్ కూడా పవర్ స్టార్ టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఏజెంట్ గా ముస్తాబవుతోన్న అఖిల్.. తర్వాతి సినిమా కు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేశారట. ఏజెంట్ ఈ సెప్టెంబర్ లోనే విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఆగస్ట్ 12న అన్నారు కానీ పోస్ట్ పోన్ అయింది.

అఖిల్ రిపీట్ చేస్తోన్న పవన్ కళ్యాణ్ టైటిల్ ఏంటో తెలుసా.. తమ్ముడు. యస్.. పవన్ కళ్యాణ్‌ ఫస్ట్ హాఫ్‌ అంతా జులాయిగా కనిపించి చివర్లో తండ్రి కోరిక నిలబెట్టి అన్న సాధించలేనిది సాధించిన తమ్ముడుగా సూపర్ హిట్ అయిన మూవీ ఇది. చివర్లో వచ్చే బాక్సింగ్ ఫైట్ తో పాటు ఆ ఫైట్ కు ప్రిపేర్ అయ్యే పాట కూడా హైలెట్ గా ఉన్న ఈ చిత్ర టైటిల్ ను రిపీట్ చేయడం అంటే ఖచ్చితంగా ఆ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచడమే. ఏజెంట్ తర్వాత అఖిల్ దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయబోతున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోతోన్న మూవీ ఇది. ముందుగా ఈ కథ అల్లు అర్జున్ తో చేయాలనుకున్న ఐకన్ అన్నారు. కానీ కొత్త కథే అని ఇప్పుడు చెబుతున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్‌ టైటిల్ రిపీట్ చేస్తూ వచ్చిన తొలిప్రేమ మంచి విజయమే సాధించింది. ఇప్పుడు రాబోతోన్న ఖుషీ కూడా పాజిటివ్ ఫ్లేవర్ తోనే కనిపిస్తోంది. ఇదీ హిట్ అయితే ఈ కొత్త తమ్ముడు కూడా ఉత్సాహంగానే కనిపిస్తాడు. ఒకవేళ తమ్ముడు కూడా సక్సెస్ అయితే ఇక పవన్ కళ్యాణ్‌ టైటిల్స్ ను రిపీట్ చేసే ట్రెండ్ కూడా పెరుగుతుందేమో.

Related Posts