Aadipurush : ఆదియు అంతము రామునిలోనే

ఆదిపురుష్‌.. ప్రభాస్ నుంచి వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ. సీతారాముల గాథగా వస్తోన్న ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ తెరకెక్కించాడు. మొదట్లో చాలా సందేహాలున్నా.. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తర్వాత అన్నీ క్లియర్ అయిపోయాయి. ప్రభాస్ రాముడుగా.. కృతి సనన్ సీతగా నటించిన ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 70 భాషల్లో విడుదల కాబోతోంది.

ఇక లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి ‘ రామ్ సీతా రామ్’ అనే బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట ఆరంభానికి ముందు సీతారాముల మధ్య ఓ అందమైన సంభాషణ ఉంటుంది.. ” నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వుండాల్సింది రాజభవనంలో” అంటాడు రాముడు.. ” నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజ మందిరం.. “, ” మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళుతుందేమో.. మీ జానకి వెళ్లదు” అంటుంది సీత.
” ఆదియు అంతము రామునిలోనే.. మా అనుబంధమూ రామునితోనే.. ఆప్తుడు బంధువు అన్నియు తానే.. అలకలు పలుకులు ఆతనితోనే.. ” అంటూ సాగే ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. సచేత్- పరంపర ద్వయం సంగీతాన్ని అందించగా తెలుగులో కార్తీక్ తో పాటు సచేత్ – పరంపర కలిసి పాడారు.


ఏదేమైనా ట్రైలర్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఈ పాట వేసిందని చెప్పొచ్చు. పూర్తి వీడియో సాంగ్ గా విడుదల చేయడంతో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి ఇస్తోందీ గీతం. అడవిలో సీతారాములు పడుతున్న కష్టాలతో పాటు.. రావణ లంకలో సీత ఎదుర్కొన్న కష్టాలను కూడా చూపిస్తూ సాగిన ఈ పాట ఆద్యంత ఒక డివైన్ ఫీలింగ్ ను ఇచ్చిందని చెప్పొచ్చు. మొత్తంగా గతంలో ఉన్న నెగెటివిటీ అంతా పోగొడుతూ రోజు రోజుకూ సినిమాపై భారీ అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అవుతోంది ఆదిపురుష్ మూవీ టీమ్. మరి సినిమాగా ఎలా ఉంటుందో కానీ.. ఇప్పటికైతే ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ అవెయిటెడ్ అనిపించుకుందీ చిత్రం.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

9 mins ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

3 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

3 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

3 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

4 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

9 hours ago