Aadipurush : ఆదియు అంతము రామునిలోనే

ఆదిపురుష్‌.. ప్రభాస్ నుంచి వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ. సీతారాముల గాథగా వస్తోన్న ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ తెరకెక్కించాడు. మొదట్లో చాలా సందేహాలున్నా.. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తర్వాత అన్నీ క్లియర్ అయిపోయాయి. ప్రభాస్ రాముడుగా.. కృతి సనన్ సీతగా నటించిన ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 70 భాషల్లో విడుదల కాబోతోంది.

ఇక లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి ‘ రామ్ సీతా రామ్’ అనే బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట ఆరంభానికి ముందు సీతారాముల మధ్య ఓ అందమైన సంభాషణ ఉంటుంది.. ” నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వుండాల్సింది రాజభవనంలో” అంటాడు రాముడు.. ” నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజ మందిరం.. “, ” మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళుతుందేమో.. మీ జానకి వెళ్లదు” అంటుంది సీత.
” ఆదియు అంతము రామునిలోనే.. మా అనుబంధమూ రామునితోనే.. ఆప్తుడు బంధువు అన్నియు తానే.. అలకలు పలుకులు ఆతనితోనే.. ” అంటూ సాగే ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. సచేత్- పరంపర ద్వయం సంగీతాన్ని అందించగా తెలుగులో కార్తీక్ తో పాటు సచేత్ – పరంపర కలిసి పాడారు.


ఏదేమైనా ట్రైలర్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఈ పాట వేసిందని చెప్పొచ్చు. పూర్తి వీడియో సాంగ్ గా విడుదల చేయడంతో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి ఇస్తోందీ గీతం. అడవిలో సీతారాములు పడుతున్న కష్టాలతో పాటు.. రావణ లంకలో సీత ఎదుర్కొన్న కష్టాలను కూడా చూపిస్తూ సాగిన ఈ పాట ఆద్యంత ఒక డివైన్ ఫీలింగ్ ను ఇచ్చిందని చెప్పొచ్చు. మొత్తంగా గతంలో ఉన్న నెగెటివిటీ అంతా పోగొడుతూ రోజు రోజుకూ సినిమాపై భారీ అంచనాలు పెంచడంలో సూపర్ స�