”లోకం ఎరుగని కథ” టీజర్ విడుదల

తండ్రీ ,కొడుకుల మధ్య జరిగే రైవల్రీ కథే “లోకం ఎరుగని కథ’. శ్రీమతి సుజాత సమర్పణలో  క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేంద్ర కుమార్, హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పూజిత హీరోయిన్. రవి కాంత్ జమి నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర కుమార్,మాట్లాడుతూ..నిర్మాత  రవికాంత్ జమి గారికి నేను చెప్పిన కథ నచ్చడంతో మేము కొత్తవారిమైనా మమ్మల్ని నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే  లవ్ & మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి , ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టు నడుచుకునే కొడుకు ల మధ్య వినూత్న స్క్రీన్ ప్లే తో జరిగే రైవల్రీ కథే ”లోకం ఎరుగని కథ”. ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో  షూట్  చేసుకున్న ఈ సినిమాకు పాటలు  చాలా బాగా వచ్చాయి.

ఈ పాటలను కాల భైరవ, సత్య యామిని వంటి ప్రముఖ సింగర్స్ పాడడం జరిగింది.. ఈ పాటలు సరిగమ తెలుగు ద్వారా రిలీజ్ అవుతాయి. ఈ సినిమాకు పని చేసిన వారందరూ కొత్త వారైనా మంచి టాలెంట్ ఉంది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.మంచి లవ్ మరియు మెసేజ్ ఓరియెంటెడ్ తో వస్తున్న  లోకమెరుగని కథ’  సినిమాను అందరూ బ్లేస్ చేయాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్  కొప్పుల మాట్లాడుతూ..ఇంతకుముందు నేను  చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి నన్ను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులోని పాటలు బాగా వచ్చాయి. అందరినీ ఈ సినిమాలోని పాటలు అలరిస్తాయి. ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం కల్పించిన  దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.

నటుడు విజయ్ విశ్వనాధన్ మాట్లాడుతూ.. తమిళం లో కొన్ని సినిమాలు చేశాను. మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.హీరోయిన్ పూజిత మాట్లాడుతూ. ఇది నా మొదటి చిత్రం. మా టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశాము. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక  నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.కెమెరామెన్ శ్రీ ప్రసాద్ తుమ్మల మాట్లాడుతూ.. దర్శక, నిర్మాతలు మా దగ్గర నుండి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నారు. శ్రీకాంత్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కొరకు మా అసిస్టెంట్ డైరెక్టర్ బాగా సపోర్ట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు  అన్నారు.

Telugu 70mm

Recent Posts

‘స్వయంభు‘ కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్

‘కార్తికేయ 2‘తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్నాడు నిఖిల్. ఒకవిధంగా ప్రెజెంట్ దేశవ్యాప్తంగా సాగుతోన్న డివోషనల్ ట్రెండ్…

4 hours ago

ఓటు విలువ చెబుతోన్న ‘కమిటీ కుర్రోళ్లు‘

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారంలో స్పీడు పెంచారు.…

4 hours ago

‘Maayaone’ as sequel to Sandeep Kishan’s ‘Project Z

Young hero Sandeep Kishan always tries to entertain the audience with varied films regardless of…

4 hours ago

Twenty years of Sukumar’s film career

Every director has a style. Not everyone will like it. But.. there are some directors..…

5 hours ago

సందీప్ కిషన్ ‘ప్రాజెక్ట్ జెడ్‘కి సీక్వెల్ గా ‘మాయా వన్‘

జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తుంటాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ…

5 hours ago

The first single from ‘Devara’ is coming..!

Man of masses NTR most awaited movie 'Devara'. The first part of this high voltage…

5 hours ago