హాస్య మూవీస్ లో హీరోయిన్ గా రెబా మోనికా జాన్

వెర్సటైల్ హీరో శ్రీ విష్ణు కొత్త సినిమా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైంది.  రామ్ అబ్బరాజు ‘వివాహ భోజనంబు’ (ఓటీటీ రిలీజ్) తో ఆకట్టుకున్నారు. శ్రీ విష్ణు తో చేస్తున్న ఈ కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం అవుతున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ పతాకంపై రజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన కథానాయికగా నటించడానికి యంగ్ ట్యాలెంటడ్ నటి రెబా మోనికా జాన్‌ను నిర్మాతలు ఎంపిక చేశారు. రెబా మోనికా గతంలో మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో ఆకట్టుకున్నారు.

హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా పూర్తి ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి భాను బోగవరపు కథని అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్‌ అందిస్తున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది.గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

9 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

13 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

13 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

15 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

17 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

19 hours ago