ప్రభాస్ కోసం రంగంలోకి తమన్

ఫామ్ లో ఉన్నప్పుడు ఉండే బూమ్ వేరే ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ అయినా.. సినిమా ఇండస్ట్రీ అయినా. ప్రస్తుతం తమన్ ఆ ఫామ్ లోనే ఉన్నాడు. అందుకే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకూ.. పెద్ద హీరోల నుంచి ప్యాన్ ఇండియన్ స్టార్స్ వరకూ అతని మ్యూజిక్ కోసం ఎదురుచూస్తున్నారు. అదీ అతని రేంజ్ ఇప్పుడు. ఆ రేంజ్ కు ప్రభాస్ సినిమా కూడా తలవంచక తప్పలేదు. పైగా రీసెంట్ గా వచ్చిన అఖండ చూసిన తర్వాత తమన్ సౌండ్ ఓవర్శీస్ వరకూ వెళ్లింది. ఆ రేంజ్ లో వాయించాడు మరి. ఇంకా చెబితే అఖండకు బాలయ్య తర్వాత హీరో తమనే అని ఎవరైనా ఒప్పుకుంటాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న తమన్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినా ఓ స్టార్ హీరో సినిమా వాళ్లు వచ్చి అడిగితే కాదంటాడా..? అందుకే రాధేశ్యామ్ ఆర్ఆర్ఆర్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. యస్.. రాధేశ్యామ్ తమన్ నేపథ్య సంగీతం అందించబోతున్నాడు.
రాధేశ్యామ్ కు సౌత్ పాటల వరకూ జస్టిన్ ప్రభాకరన్ అనే అతను మ్యూజిక్ ఇచ్చాడు. అతను ఇచ్చిన పాటలు నిజంగా చెబితే ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేదు. మరి నేపథ్య సంగీతం కూడా అంతే చప్పగా ఉంటే మొత్తానికే మోసం వస్తుందనుకున్నారో ఏమో.. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ ను రంగంలోకి దించారు. నిజానికి తమన్ పాటలు ఎలా ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. చాలా సినిమాల్లో కొన్ని సీన్స్ డల్ ఉన్నా.. డ్రమ్స్ తో విషయం ఆడియన్స్ పట్టేయకుండా చూసుకున్నాడు.


రాధేశ్యామ్ పీరియాడిక్ లవ్ స్టోరీ కాబట్టి.. మరీ ఎక్కువ వాయించక్కర్లేదు. కానీ ఫీల్ గుడ్ ఆర్ఆర్ ను మాత్రం ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఓ రకంగా అఖండ వంటి ఊరమాస్ తర్వాత రాధేశ్యామ్ వంటి క్లాస్ మూవీ పడటం తమన్ కు ప్రత్యేకమే. ఆ ప్రత్యేకతను నిరూపించుకుంటే అతన్ని మించిన వారు ఇప్పట్లో లేరని నిస్సిందేహంగా ఒప్పేసుకోవచ్చు.

Related Posts