ప్రేక్షకులను మోసం చేస్తోన్న స్టార్లు

ప్రేక్షకులను మన స్టార్ హీరోలు, నటులు, పరిశ్రమలోని ఇతరులంతా ఓ రకంగా మోసం చేస్తున్నారు. ఈ మాట కాస్త పెద్దగా అనిపించొచ్చు. కానీ అసలు విషయం తెలిస్తే అదే నిజం అని అర్థమౌతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే స్టార్ హీరోల స్వార్థాన్ని తెలియజేసేందుకు రీసెంట్ గా వచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ ల చిత్రం పుష్పతో పాటు నాని శ్యామ్ సింగరాయ్ ఓ ఉదాహరణ. యస్.. ఈ రెండు సినిమాల తర్వాత స్టార్ హీరోల రెస్పాన్స్ ను చూస్తే వారు ప్రేక్షకులపై ఎంత ‘ప్రేమ’గా ఉన్నారో తెలుస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య కాలంలో పుష్ప చిత్రం ఓటిటిలో విడుదలైంది. ఆ తర్వాత చూడాలి ఇంకా తెలుగు హీరోల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకూ ఈ చిత్రాన్ని ఓ రేంజ్ లో పొగుడుతూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇంత వరకూ బానే ఉంది. కానీ వీళ్లెవరూ థియేటర్ కు వెళ్లి ఆ సినిమాను చూడలేదు. యస్.. ప్రస్తుతం పుష్ప గురించి ట్విట్టర్ లో రెచ్చిపోతోన్న ఈ సెలబ్రిటీ కూడా ఈ మూవీని థియేటర్ లో చూసి ట్వీటడం లేదు. హాయిగా ఇంట్లో కూర్చుని ఓటిటిలో చూసి ఓ ట్వీట్ పారేస్తున్నారు.
మరి అదే జనాల వరకూ వచ్చేసరికి ఇదే స్టార్లు.. ‘మీరంతా మా సినిమాను ఖచ్చితంగా థియేటర్స్ కు వెళ్లి మాత్రమే చూడాల’ని ఓ రేంజ్ లో ఊదరగొడుతుంటారు. ఇప్పుడు పాండమిక్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని.. అవసరమైతే ఆగండి. ఓటిటిలో చూడండి అని జనానికి చెప్పరు. జనం మాత్రం థియేటర్స్ లోనే వారి సినిమాలు చూడాలి. వీరు మాత్రం ఓటిటిలో వచ్చే వరకూ ఆగుతారు. మరి ఇది ఎలాంటి నీతి అనేది వారికే తెలియాలి. ముఖ్యంగా పుష్ప గురించి పొగుడుతోన్న వారంతా ఆ సినిమాను ఓటిటిలోనే చూశారు అనేది వాస్తవం. ఏదేమైనా స్టార్స్ అంటే కేవలం వ్యాపారస్తులు మాత్రమే. వారి అవసరానికే ఏం చెప్పినా.. అంతేకానీ వారు పాటించరు అని స్టార్స్ అంటే పడిచచ్చే అభిమానులు ఎప్పటికీ తెలుసుకోలేరేమో..

Related Posts