వారసుల పంచాయితీగా సంక్రాంతి వార్

సంక్రాంతి.. మునుపెన్నడూ లేనంతంగా చాలా సాధారణ సినిమాలతో వస్తోంది. ఒక్క బంగార్రాజు తప్ప మిగతా రెండు సినిమాల్లో హీరోలెవరనేది కామన్ ఆడియన్సెస్ కు తెలిసే అవకాశం తక్కువ. తెలిసినవారికి కూడా వారి కేరాఫ్ తెలిసిన తర్వాత మరో వారసత్వ పోరులా చూస్తున్నారు తప్ప.. ఇదేదో మంచి సినిమాల మధ్య పోటీలా భావించడం లేదు. అలాగని కొత్త కుర్రాళ్లను తక్కువ చేయడం లేదు. బట్.. సింపుల్ గా చూస్తే ఈ సంక్రాంతి వారసుల మధ్య పోరులాగానే కనిపిస్తోంది.
నాగార్జున సీనియర్ హీరో. ఆయన తనయుడు నాగచైతన్య మరో మెయిన్ హీరోగా నటించిన బంగార్రాజుతో కొడుక్కి ఓ సాలిడ్ మాస్ హిట్ ఇవ్వాలనే ఆరాటంలోనూ ఉన్నాడు నాగార్జున. అంటే చైతూ హిట్లే లేవని కాదు.. రీసెంట్ గా వచ్చిన వాటిలో మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ వంటి చిత్రాలు ఓ తరహాలో సాగుతాయి. అందులో ఎక్కువమందికి రీచ్ అయ్యే మాస్ ఎలిమెంట్స్ తక్కువ. అందుకే బంగార్రాజులో ఆ స్కోప్ ఉంది. దీంతో ఈ చిత్రం విజయాన్ని కొడుకు ఖాతాలో వేయాలనే ఆరాంటం నాద్ ది. బంగార్రాజు 14న వస్తున్నాడు.
ఇక బంగార్రాజుతో పాటే వస్తున్న హీరో ఆశిష్. రౌడీబాయ్స్ మూవీతో బరిలోకి దిగుతోన్న ఇతగాడు ఇంతకు ముందు సోషల్ మీడియాలో కూడా సినీ జానలకూ పెద్దగా తెలియదు. సడెన్ గా హీరోగా ఎంట్రీ ఇస్తోన్న అతను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడి కొడుకు. ఓ రకంగా దిల్ రాజు వారసుడుగా చెప్పినా తప్పేం లేదు. రౌడీబాయ్స్ ట్రైలర్ చూస్తే కలగూరగంపలా ఉంది. అయినా యూత్ ఫుల్ కంటెంట్ తో విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. సో.. సంక్రాంతి వార్ లో ఈ వారసుడి లక్ ఏంటో తేలిపోతుందన్నమాట.
జనవరి 15న మరో వారసుడు ‘హీరో’గా వస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎమ్.పి గల్లా జయదేవ్ తనయుడైన ఈ కుర్రాడు రాజకీయంగా కాక తాత వారసత్వంతో సినిమాల్లోకి వచ్చాడు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చ�