స్టార్ హీరోలు సరే.. మరి నువ్వు చేసేదేంటీ వర్మా..?

ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అనే సామెత ఊరికే రాలేదు. కొన్నిసార్లు రామ్ గోపాల్ వర్మకు ఇది బాగా అప్లై అవుతుంది. నోటికి ఏది వస్తే అది ట్వీటే వర్మ.. అప్పుడప్పుడూ నిజాలే చెబుతాడు కూడా. లేటెస్ట్ గా ఓ మేటర్ లో కెజీఎఫ్ ను చూసి నిర్మాతలు నేర్చుకోవాలని ఓ ఉచిత సలహాను ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ఏం చెప్పాడో తెలుసా..? ‘‘ కెజీఎఫ్ భారీ విజయం సాధించడాన్ని చూసి ఇకనైనా హీరోల రెమ్యూనరేషన్ కోసం కాకుండా మేకింగ్ పై ఎక్కువ ఖర్చు చేయాలి. అప్పుడే క్వాలిటీతో సినిమాలతో పాటు భారీ సినిమాలు, భారీ విజయాలూ వస్తాయి’’ అని చెప్పాడు.

ఓ రకంగా ఇది నిజమే. ఆ నిజం పక్కన బెడితే.. ఏ స్టార్లూ లేకుండానే తను తీస్తోన్న సినిమాలేంటి మరి..? తన బడ్జెట్ అంతా మేకింగ్ కోసమే కదా ఉంటుంది. మరి అతని సినిమాల్లో క్వాలిటీ ఎంత.. భారీదనం ఎంత..? అసలు తన సినిమాల్లో నటించే వారికి రెమ్యూనరేషన్స్ ఇస్తాడా అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది. ఈ మాటంటే అది నిర్మాత పని కదా అంటాడు. వర్మ చేసే సినిమాల్లో నిర్మాతలకు పని ఉంటుందా అసలు..?

చీప్ మూవీస్ తీస్తూ.. తను ఎదుటి వారికి నీతులు చెబితే ఎట్టా అంటున్నారు చాలామంది. హీరోల రెమ్యూనరేషన్ గురించి ఇదే వర్మ గతంలో టికెట్ రేట్ల వ్యవహారంలో ఏపి మంత్రి పేర్ని నాని మాట్లాడితే.. ఆ హీరోలను, వారి రెమ్యూనరేషన్స్ ను వెనకేసుకు వచ్చి మాట్లాడాడు. మరి ఇప్పుడేమో వారికి రెమ్యూనరేషన్స్ భారీగా ఇవ్వొద్దు అని ఇన్ డైరెక్ట్ గా అర్థం వచ్చేలా ట్వీటాడు. అందుకే .. ఏ ఎండుకు ఆ గొడుగు పట్టడంలో వర్మ తర్వాతే ఎవరైనా అని.. ఏదేమైనా ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అనే మాట వర్మకు వంద శాతం వర్తిస్తుంది..

Related Posts