ఉత్తరాంధ్రలో యాంకర్ సుమ పంచాయితీ తేల్చేదేంటీ..?

యాక్టర్ గానే ఇండస్ట్రీకి వచ్చినా.. యాంకర్ గా సెటిల్ అయింది సుమ. మళయాలీ అయినా తెలుగువారికంటే ఎక్కువగా, బాగా తెలుగు మాట్లాడుతూ యాంకరింగ్ మెగాస్టార్ అనిపించుకుంది. నిజం.. తనను కొట్టే యాంకర్ ఇప్పుడు తెలుగులో లేనే లేదు.. వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. అది తన టాలెంట్ కు దక్కే ప్రతిఫలం. ఏ వేదికైనా తనదైన శైలిలో రక్తి కట్టిస్తుంది. ఒక్కోసారి ఓవర్ గా మాట్లాడినా..ఓవరాల్ గా తన తర్వాతే ఎవరైనా అంటే ఒప్పుకుని తీరాల్సిందే. అలాంటి తను ఫస్ట్ టైమ్ ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ చేస్తూ నటించిన సినిమా జయమ్మం పంచాయితీ.. ఈ నెల 22న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

మోషన్ పోస్టర్ నుంచే జయమ్మ పంచాయితీ కాస్త ఆకట్టుకుంటుంది. ఆ మధ్య వచ్చిన టీజర్ తో పాటు పాట కూడా బావుంది అనిపించుకుంది. ట్రైలర్ చూస్తే ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే కథగా తెలుస్తుంది. పాత్రధారులంతా ఆ స్లాంగ్ లోనే మాట్లాడుతున్నారు. సుమ చుట్టు తిరిగే కథలానే కనిపిస్తోంది. ఆమె భర్త పాత్రలో నిన్నటి దర్శకుడు నేటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దేవీ ప్రసాద్ నటించాడు. కలివరపు విజయ్ కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సంగీతం ఎమ్ఎమ్ కీరవాణి అందించాడు.

ఇక ట్రైలర్ చూస్తే ఇది కుల కోణంలో సాగే కథలా కనిపిస్తోంది.ఓ బ్రాహ్మిణ్ కుర్రాడు.. మరో నాన్ బ్రాహ్మిణ్ అమ్మాయిని ప్రేమించడ అనే కాన్సెప్ట్ గా కనిపిస్తోంది. అదే టైమ్ లో తను ఎంత బేవార్స్ అయినా ఊళ్లో ఉన్న గుడి ఇచ్చారంటే కారణం నేను బ్రాహ్మిణ్ కావడం వల్లే అని సదరు క్యారెక్టర్ చేత కూడా చెప్పిండం.. ఆ వర్గానికి కోపం వచ్చేలా చేస్తుందేమో కూడా. ఆ మధ్య ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే పలాస అనే సినిమా కూడా ఇలా క్యాస్ట్ ఇష్యూను డిస్కస్ చేసింది. కాకపోతే వాళ్ల చాలా సీరియస్ గా ఆ సబ్జెక్ట్ ను చెప్పారు. వీళ్లు కాస్త దాన్ని డ్రామా చేసినట్టు కనిపిస్తున్నారు. ఏదేమైనా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమా అంటే వైవిధ్యం చాలా ఉండే అవకాశం ఉంది. అయినా జయమ్మ పంచాయితీ కూడా కులకోణాన్నే ఎత్తుకోవడం వెనక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.

Related Posts