విశ్వక్ సేన్ తప్పుకున్నాడు.. మరి మిగతా వాళ్లో..?

సినిమా తీయడం కంటే సరైన రిలీజ్ డేట్ పట్టుకోవడమే పెద్ద టాస్క్ అయిందిప్పుడు. ముఖ్యంగా పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఇది కత్తిమీద సాము. అయినా ఈ నెల 22న కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్నాయి. ఆ రోజు దగ్గరకు వస్తున్నా.. వాళ్లలో ఏ సందడి కనిపించడంలేదు. పైగా ఓ సినిమా ఆల్రెడీ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి మిగతా సినిమాలైనా వస్తాయా..? అసలు ఆ చిత్రాలేంటీ..?\

విశ్వక్ సేన్, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. విశ్వక్ శైలికి భిన్నమైన కంటెంట్ తో వస్తున్నట్టుగా ఈ మూవీ టీజర్, పాటలు చూస్తే అర్థమైంది. ఓ ఏజ్ బార్ వ్యక్తి పెళ్లి కోసం పడే తంటాల నేపథ్యంలో అల్లుకున్న కథలా అనిపించింది. నిజానికి ఈ మూవీని మార్చిలోనే విడుదల చేయాలనుకున్నారు. కుదర్లేదు. అప్పుడే ఏప్రిల్ 22 విడుదల అని చెప్పారు. బట్ వీళ్లు ఆ డేట్ లో రావడం లేదని కొత్తగా అప్డేట్ చేశారు. పైగా కొత్త రిలీజ్ డేట్ కూడా చెప్పారు.
ఇక అదే రోజు వస్తోన్న చిత్రం కృష్ణ వృంద విహారి. నాగశౌర్య, షిర్లే సేథ్ జంటగా నటించిన మూవీ ఇది. శౌర్య సొంత బ్యానర్ లోనే రూపొందింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 22 బరిలో ఉంది. కానీ ఇప్పటి వరకూ ప్రమోషన్స్ పరంగా ఏ సందడీ కనిపించడం లేదు. మరి వీళ్లు బరిలో ఉంటారా లేక తప్పుకుంటారా అనేది కెజీఎఫ్ కలెక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది.

ఇక మిగిలింది జయమ్మ పంచాయితీ. సుమ ప్రధాన పాత్రలో నటించిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ డ్రామా మూవీ ఆ రోజే వస్తుందన్నారు. కొంత వరకూ సోషల్ మీడియాలో సుమ సందడి కనిపిస్తోంది. అంటే ఈ పంచాయితీని 22నే తేల్చుకుంటారు అనుకోవచ్చు. అలాగని ఖచ్చితంగానూ చెప్పలేం..

ఇక ఇదే బరిలో నిలిచిన మరో సినిమా 1996ధర్మపురి. పెద్దగా తెలియని మొహాలతో వస్తోన్న సినిమా ఇది. ట్రైలర్ ఫర్వాలేదనిపించుకున్నా.. 22న వస్తే వీళ్లకు థియేటర్స్ దొరుకుతాయా అనేది పెద్ద సమస్య. అలాగని మరో వారం వరకూ ఆగితే.. అప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య వస్తుంది. సో రెండు పెద్ద సినిమాల మధ్య వీళ్లు ఇరుక్కుపోయారనే చెప్పాలి. ఏదేమైనా ఈ నెల 22న వస్తున్నాం అని స్ట్రాంగ్ గా అనౌన్స్ చేసిన మొదటి మూడు సినిమాలు మాత్రం పెద్దగా సందడి చేయడం లేదు. ఒకరు తప్పుకున్నారు. ఇద్దరు బరిలో ఉన్నారు. మరి వీళ్లు వస్తారా లేదా అనేది త్వరలోనే తెలుస్తుందేమో.

Related Posts