‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న ఈ సినిమా ఈపాటికే ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. అయితే.. మధ్యలో శంకర్ ఆగిపోయిన తన ‘ఇండియన్ 2’ని మళ్లీ మొదలుపెట్టడంతో ‘గేమ్ ఛేంజర్’ వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్నా.. ఇంకా ‘గేమ్ ఛేంజర్’ కోసం 45 రోజుల వరకూ షూటింగ్ చేయాల్సి ఉందట.

45 రోజుల షూటింగ్ అంటే ఇంకా చాలా బ్యాలెన్స్ వర్క్ ఉన్నట్టు అర్థం. గడిచిన కొన్ని నెలలుగా.. ఒక నెలలో కేవలం ఐదారు రోజుల మాత్రమే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ చేస్తూ వస్తున్నాడు శంకర్. జూలై లో ‘ఇండియన్ 2’ విడుదలైతే.. సెప్టెంబర్ నుంచి ‘గేమ్ ఛేంజర్’పై ఫోకస్ పెడతాడు. ఎలా లేదన్నా ఈ ఏడాది చివరివరకూ ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయి. దీంతో.. వచ్చే ఏడాదే ‘గేమ్ ఛేంజర్’ విడుదలయ్యే అవకాశాలున్నాయన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

Related Posts