‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రపై క్లారిటీ రాబోతుంది

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతోన్న ‘కన్నప్ప’.. తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీగా రెడీ అవుతోంది. అందుకు ప్రధాన కారణం ఈ సినిమాలో నటిస్తున్న భారీతారాగణం. రెబెల్ స్టార్ ప్రభాస్ మొదలుకొని.. బాలీవుడ్ ఖిలాడి హీరో అక్షయ్ కుమార్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా.. మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణమే ‘కన్నప్ప’లో భాగస్వాములయ్యారు.

గత కొన్ని రోజులుగా ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ ఏ పాత్ర చేయబోతున్నాడనే దానిపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఈ మూవీలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడని.. లేదా నందీశ్వరుడిగా నటిస్తున్నాడని.. అవధూతగా అలరించబోతున్నాడని.. రకరకాల ప్రచారం జరుగుతుంది. అయితే.. త్వరలోనే వాటిన్నింటిపైనా క్లారిటీ రాబోతుందని హీరో, నిర్మాత మంచు విష్ణు తెలిపాడు. ‘కన్నప్ప’ గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు.

‘కన్నప్ప’ గత కొన్ని రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగుతోందని.. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన వరుస అప్డేట్స్ అన్నీ ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాయని తెలిపాడు విష్ణు. అలాగే.. ‘కన్నప్ప’లో మహామహులైన నటులు నటిస్తున్నారని.. ఈ కథలో వారి పాత్రలు చాలా గొప్పగా ఉంటాయని.. ఆ పాత్రలన్నింటినీ ఒక్కొక్కటిగా రివీల్ చేయబోతున్నామని తెలిపాడు విష్ణు. ఇక.. ఈ సినిమాలో ప్రభాస్ పోషించే పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీలో ప్రభాస్ తనకు బాగా నచ్చిన పాత్రనే చేస్తున్నాడని.. అతనే తాను ఆ పాత్రను చేయొచ్చా అని అడిగి చేస్తున్నాడని విష్ణు క్లారిటీ ఇచ్చాడు. అలాగే.. సోమవారం నాడు ‘కన్నప్ప’ నుంచి ఓ అద్భుతమైన అప్డేట్ అందించబోతున్నామని కూడా క్లారిటీ ఇచ్చాడు.

Related Posts