శంకర్ సెంటిమెంట్.. రామ్ చరణ్ కు సూపర్ హిట్

ఇండియాస్ టాప్ డైరెక్టర్ శంకర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే కథా పరంగా  కంటే టెక్నాలజీ పరంగా ఎంత హై గా ఉంటుందో చూస్తున్నారిప్పుడు ఆడియన్సెస్. ఒకప్పుడు అతని సినిమాల్లో బలమైన కథలు కనిపించాయి. కానీ ఇప్పుడు ఆ విషయంలో వీక్ గా ఉన్నాడు శంకర్. కారణం ఏంటో అందరికీ తెలుసు. శంకర్ క్యాంప్ లో ఒకప్పుడు సుజాత అనే రచయిత ఉండేవాడు. ఆయన ఇచ్చిన కథలతోనే శంకర్ దేశవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించాడు. సుజాత మరణించిన తర్వాత ఆ స్థాయి రచయిత మళ్లీ అతని క్యాంప్ లో పడలేదు. అందుకే అపరిచితుడు వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు శంకర్ కు. కథలు దొరక్కే కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ త్రీ ఇడియట్స్ ను నన్బన్(స్నేహితుడు) పేరుతో విజయ్ హీరోగా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. తర్వాత వచ్చిన ఐ డిజాస్టర్ అయితే 2.0 మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అటుపై భారతీయుడు సీక్వెల్ మొదలుపెట్టినా అది అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఈ కథ విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. ఐఏఎస్ గా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్లి ఏకంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే పాయింట్ తో గతంలో ఒకే ఒక్కడు వచ్చింది. కాకపోతే అందులో హీరో జర్నలిస్ట్. అంటే ఓ రకంగా ఇప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ఒకే ఒక్కడు అనుకోవచ్చు. విశేషం ఏంటంటే.. ఈ కథ శంకర్ ది కాదు. మరో దర్శకుడుది.
తమిళ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో విజయాలు అందుకుని చిన్న వయసులోనే పెద్ద స్టార్స్ తో పనిచేసిన కార్తీక్ సుబ్బరాజ్ కథతోనే ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు శంకర్. ఈ విషయం కార్తీక్ సుబ్బరాజే చెప్పాడంతో ఓ క్లారిటీ వచ్చింది. అఫ్ కోర్స్ ఈ కథలో తనదైన శైలిలో శంకర్ కూడా మార్పులు చేర్పులు చేస్తాడు. అయితే ఇక్కడో సెంటిమెంట్ ఉంది. శంకర్ కు బయటి వారు ఇచ్చిన కథలు బాగా కలిసొచ్చాయి. ఓ రకంగా అదో సెంటిమెంట్ కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఖచ్చితంగా రామ్ చరణ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం.. మళ్లీ శంకర్ కు పూర్వ వైభవం రావడం ఖాయం అనుకోవచ్చు.
Telugu 70mm

Recent Posts

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

1 hour ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

2 hours ago

బుల్లితెర నటుడు చందు జీవితంలో మరో కోణం

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్య సంచలనం సృష్టించింది. సీరియల్ నటి పవిత్ర కార్ యాక్సిడెంట్ లో మరణించడం వలనే చందు…

2 hours ago

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి…

11 hours ago

‘Devara’.. ‘Fear Song’ promo is here

After the blockbuster like 'Janatha Garage', the film 'Devara' is being made in the combination…

11 hours ago

Dil Raju is getting more aggressive

Dil Raju is definitely one of the first names to be remembered as star producers…

11 hours ago