శంకర్ సెంటిమెంట్.. రామ్ చరణ్ కు సూపర్ హిట్

ఇండియాస్ టాప్ డైరెక్టర్ శంకర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే కథా పరంగా కంటే టెక్నాలజీ పరంగా ఎంత హై గా ఉంటుందో చూస్తున్నారిప్పుడు ఆడియన్సెస్. ఒకప్పుడు అతని సినిమాల్లో బలమైన కథలు కనిపించాయి. కానీ ఇప్పుడు ఆ విషయంలో వీక్ గా ఉన్నాడు శంకర్. కారణం ఏంటో అందరికీ తెలుసు. శంకర్ క్యాంప్ లో ఒకప్పుడు సుజాత అనే రచయిత ఉండేవాడు. ఆయన ఇచ్చిన కథలతోనే శంకర్ దేశవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించాడు. సుజాత మరణించిన తర్వాత ఆ స్థాయి రచయిత మళ్లీ అతని క్యాంప్ లో పడలేదు. అందుకే అపరిచితుడు వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు శంకర్ కు. కథలు దొరక్కే కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ త్రీ ఇడియట్స్ ను నన్బన్(స్నేహితుడు) పేరుతో విజయ్ హీరోగా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. తర్వాత వచ్చిన ఐ డిజాస్టర్ అయితే 2.0 మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అటుపై భారతీయుడు సీక్వెల్ మొదలుపెట్టినా అది అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఈ కథ విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. ఐఏఎస్ గా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్లి ఏకంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే పాయింట్ తో గతంలో ఒకే ఒక్కడు వచ్చింది. కాకపోతే అందులో హీరో జర్నలిస్ట్. అంటే ఓ రకంగా ఇప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా �