గాడ్సే గా పవన్ ఫుల్ పాయింట్ తో వస్తోన్న సత్యదేవ్

మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ ఇక స్టార్ అనిపించుకునే ప్రయత్నాల్లో రెగ్యులర్ గా మూవీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా కథాబలం ఉన్న చిత్రాలతో హీరోగా నటిస్తున్నాడు. కాకపోతే ఇంకా స్టార్డమ్ అనే మాట వినిపించడం లేదు. అయినా ఓ మంచి నటుడుగా సత్యదేవ్ కు చాలామంది అభిమానులే ఉన్నారు. కేవలం హీరోగానే కాక కాస్త సీరియస్ గా క్యారెక్టర్స్ వైపు దృష్టిపెడితే ఖచ్చితంగా సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా సత్యదేవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఆ క్రమంలో ముందుగా వస్తోన్న చిత్రం గాడ్సే. సి కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. లేటెస్ట్ గా ఈ గాడ్సే టీజర్ ను మెగాస్టార్ చేతుల మీదుగా విడుదల చేశారు.

టీజర్ చూస్తే చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. రాజకీయ నాయకుల అవినీతిని ఎండగడుతూనే నిరుద్యోగ సమస్యను ప్రధానంగా హైలెట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఫీమేల్ లీడ్ గా ఐశ్వర్య లక్ష్మి కనిపిస్తోంది. కానీ తను రెగ్యులర్ హీరోయిన్ గా కాక పోలీస్ ఆఫీసర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేసినట్టు అర్థమవుతోంది. టీజర్ మొత్తంగా క్రిస్పీగా, గ్రిప్పింగ్ గా కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై లెవల్లో ఉన్నాయి. ఇక టీజర్ చివర్లో ‘ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయి.. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయి.. వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయి.. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందలు వేలు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయిరా.. ? బికాజ్ యూ ఆర్ లూటింగ్ పబ్లిక్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్’ అంటూ పొలిటీషియన్స్ ను ఉద్దేశిస్తూ చెప్పిన డైలాగే సినిమాలోనూ హైలెట్ అవుతుంది అనిపించేలా ఉంది.. మరి ఈ మూవీతో సత్యదేవ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Related Posts