HomeLatest'సర్కారు నౌకరి' ట్రైలర్.. డిఫరెంట్ స్టోరీతో సునీత తనయుడు

‘సర్కారు నౌకరి’ ట్రైలర్.. డిఫరెంట్ స్టోరీతో సునీత తనయుడు

-

గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న హృద్యమైన చిత్రంగా ఈ సినిమా ఉంటుందని అనిపించింది. అయితే.. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ తో ఈ సినిమా కథపై ఓ క్లారిటీ వచ్చింది.

సర్కారు నౌకరి సంపాదించుకున్న ఆకాశ్ కి.. గ్రామాల్లో నిరోధ్ వాడకం గురించి అవగాహన కల్పించే పని అప్పగిస్తారు. అప్పటివరకూ నిరోధ్ పైన ఎలాంటి అవగాహన లేని ఆ గ్రామస్తులు అతడిని ఎలా చూశారు? సర్కారు నౌకరి చేస్తున్నాడని పెళ్లి చేసుకున్న భార్య.. ఈ విషయంలో అతనికి సహకరించిందా? లేదా? అనేదే ఈ సినిమా కథాంశంగా ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
ఈ సినిమాతో కథానాయికగా భావన పరిచమవుతోంది. తనికెళ్ల భరణి మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో పీరియడ్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. గంగనమోని శేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీతో పాటు రచన, దర్శకత్వం వహించాడు. జనవరి 1న ‘సర్కారు నౌకరి’ విడుదలకు ముస్తాబవుతోంది.

ఇవీ చదవండి

English News