‘హనుమాన్‘ ట్రైలర్.. ఆద్యంతం విజువల్ వండర్

పేరుకు చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతోన్న చిత్రం ‘హనుమాన్’. ఇప్పటివరకూ హాలీవుడ్ సూపర్ హీరోస్ మూవీస్ చూసుంటారు.. కానీ మన సూపర్ హీరో హనుమాన్ ముందు వాళ్లంతా జీరో అంటూ ఇప్పటికే ప్రమోషన్స్ లో జోరు చూపించింది టీమ్. లేటెస్ట్ గా ‘హనుమాన్‘ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.

అఖండ భారత ఇతిహాసం ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ముందుగా ఓ టైటిల్ కార్డ్ వేశారు. అండర్ వాటర్ ఎపిసోడ్స్ తో హనుమాన్ గా తేజ సజ్జా ఎంట్రీ కూడా అదిరింది. ఆ తర్వాత చిరుతతోనే పరుగు పందెం వేసి.. సూపర్ హీరోగా తేజ సజ్జా చేసే సాహసాలు ట్రైలర్ లో హైలైట్. హీరోకి అక్క పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించినట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. మొత్తంగా.. ఆద్యంతం విజువల్ వండర్ లా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ‘జాంబిరెడ్డి’ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రమిది. అమృత అయ్యర్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘హనుమాన్’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts