అమెరికాలో ‘సలార్‘ కలెక్షన్ల సునామీ

మరికొద్ది గంటల్లో థియేటర్లలో ‘సలార్‘ సందడి మొదలవ్వబోతుంది. ఇక ఇండియా కంటే ముందే అమెరికాలో ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈనేపథ్యంలో అమెరికాలోని ప్రీమియర్స్ కి ఇప్పటికే రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. అక్కడ ప్రీమియర్ బుకింగ్స్ రూపంలో 1.81 మిలియన్ డాలర్ల వసూళ్లు దక్కాయి. అంటే.. ఇప్పటివరకూ ఏ ఇండియన్ మూవీ ప్రీమియర్స్ పరంగా ఈ రేంజులో వసూళ్లు సాధించలేదు. అసలు షో పడకుండానే ప్రీమియర్స్ రూపంలోనే నార్త్ అమెరికాలో దాదాపు 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టంది ‘సలార్‘.

మరోవైపు ఇండియాలోనూ కలెక్షన్ల పరంగా ‘సలార్‘ సరికొత్త రికార్డులు నెలకొల్పే సూచనలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ‘బాహుబలి‘ సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న అసలు సిసలు యాక్షన్ ఎంటర్ టైనర్ కావడం.. ‘కె.జి.యఫ్‘ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం కూడా ‘సలార్‘పై అంచనాలు తారాస్థాయిలో ఉండడానికి కారణం అని చెప్పొచ్చు.

Related Posts