ఆ దర్శకుల కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోన్న సమంత..

విడాకులు కంటే ముందే టాక్ ఆఫ్ ద కంట్రీ అయింది సమంత. అందుకు కారణం ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్. ఇందులో ఆమె నటన ఎంతగా ఆకట్టుకుందో ఓ సౌత్ హీరోయిన్ గా పెళ్లి తర్వాత చేసిన అలాంటి బోల్డ్ రోల్ కూడా అంతే హాట్ టాపిక్ అయిపోయింది. ఓ రకంగా ఈ పాత్రే ఆమె ఫ్యామిలీ లైఫ్ ను కూడా డిస్ట్రబ్ చేసింది అనేవారున్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. ఇప్పుడు మరోసారి ఫ్యామిలీమేన్ 2 దర్శకులు రాజ్ అండ్ డికే తో మరో సిరీస్ చేయబోతోంది సమంత. ఇది కూడా అమెజాన్ లోనే రాబోతోంది. సమంతే ప్రధాన పాత్రగా కనిపించే ఈ చిత్రంలో ఆమెకు జోడీగా బాలీవుడ్ యంగ్ స్టర్ వరుణ్ ధావన్ నటించబోతున్నాడు. ఈ సిరీస్ ఓ రీమేక్ కావడం విశేషం.
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ఓ అమెరికన్ సిరీస్ కు రాజ్, డికే లు ఇండియన్ వెర్షన్ గా మార్చారు. అక్కడ ప్రియాంక చేసిన పాత్రలో సమంత కనిపించబోతోంది. మరో విశేషం ఏంటంటే.. ఈ సిరీస్ లో కూడా అనేక బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ ను మళ్లీ ఇక్కడా చేస్తారా లేదా అనేది చెప్పలే కానీ.. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గూఢచారులుగా కనిపిస్తారు. అందుకోసం అనేక స్టంట్స్ కూడా చేస్తారట. ఈ స్టంట్స్ ను డైరెక్ట్ చేస్తే బాడీ పార్ట్స్ మిస్ అవుతాయి. అందుకే త్వరలోనే ప్రొఫెషనల్స్ నుంచి కొన్ని స్టంట్స్ ను నేర్చుకోబోతున్నారట సమంత అండ్ వరుణ్ ధావన్.

ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలున్నాయి. వీటిలో ఓ రెండు సినిమాలు పూర్తి కాగానే 2022లోనే ఈ సిరీస్ చిత్రీకరణ ప్రారంభిస్తారట. ఏదేమైనా ఇక హాటెస్ట్ సమంత టాలెంట్ పూర్తి స్థాయిలో కంట్రీ మొత్తానికి మరోసారి తెలియబోతోందన్నమాట.

Related Posts