సల్మాన్ ఖాన్ 58వ పుట్టినరోజు

కొందరు సూపర్ స్టార్ లు గొప్పగా నటిస్తారు. కొందరు గొప్ప దర్శకులతో సినిమాలు చేసి సక్సెస్ సాధిస్తారు. కానీ.. చాలా అరుదుగా కొందరు సూపర్ స్టార్లు.. కేవలం తాము తెరపై కనిపించటంతోనే మ్యాజిక్ చేస్తారు. అలాంటి వాడే.. సల్మాన్ ఖాన్. ఆయన సినిమాకు మిగతా ఎన్ని హైలైట్స్ ఉన్నా.. మొదటి, మధ్య, చివరి విశేషం మాత్రం సల్మానే.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 1965, డిసంబర్ 27న జన్మించిన సల్మాన్ ఖాన్.. 58 ఏళ్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ బాలీవుడ్. నిస్సందేహంగా అతడికంటే సగం వయస్సున్న స్టార్స్ కి కూడా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ వెన్నులో చలి పుట్టిస్తుంటాడు. 1989లో ‘మైనే ప్యార్ కి యా’తో మొదలు పెట్టి ఇటీవల వచ్చిన ‘టైగర్ 3’ వరకూ సల్లూ భాయ్ చేసిన ప్రతీ సినిమా కలెక్షన్ల వర్షమే. వందల కోట్లు వసూలు చేయటం సల్మాన్ సినిమాలకు పరిపాటి అయిపోయింది.

ముఫ్ఫై నాలుగేళ్లకు పైగా గడిచిపోయిన సల్మాన్ కెరీర్ లో ఫ్లాపులు కూడా అదే స్థాయిలో వచ్చాయి. చాలా సార్లు సల్మాన్ ఖాన్ పని ఖతమ్ అయిపోయిందని క్రిటిక్స్ బల్లలు గుద్దేశారు. కానీ.. మళ్లీ మళ్లీ ఈ బజ్రంగీ భాయ్ జాన్ బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చి బాక్సులు బద్ధలు కొట్టేశాడు. ఇప్పుడు సల్మాన్ కెరీర్ లో మళ్లీ స్తబ్దత నెలకొంది. ఈ ఏడాది విడుదలైన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’ ఆశించిన స్థాయిలో అలరించలేపోయాయి. పైగా.. ఇప్పటివరకూ కొత్త సినిమాని కూడా ప్రటించలేదు. మరి.. బాలీవుడ్ కండల వీరుడు త్వరలోనే గ్రేట్ కమ్ బ్యాక్ ఇస్తాడని ఆశిస్తూ.. సల్లూభాయ్ కి బర్త్ డే విషెస్ చెబుదాం.

Related Posts