తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి రూ.5 లక్షలు ఇచ్చిన NATS.. చెక్ అందజేసిన సుమ కనకాల

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి రూ.5 లక్షలు ఆర్థిక సహకారం అందించింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS). యాంకర్ సుమ కనకాల ద్వారా NATS.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి ఈ సహాయాన్ని అందించింది. ప్రతీ పండగకి ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనే తలంపుతో సుమ కనకాల ఏర్పాటు చేసిన సంస్థ ఫెస్టివల్స్ ఫర్ జాయ్. ఈ సంస్థ ద్వారా NATS అందించిన ఆర్థిక సహాయాన్ని మధ్య వారధిగా నిలబడి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి అందజేశారు సుమ. ఈ సహాయం మాత్రమే కాదు NATS వారు కోట్ల రూపాయల్లో అవసరమైన వారికి సహాయం చేస్తున్నారని ఈ సందర్భంగా సుమ తెలిపారు.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోషియేస్ లో ఉన్న 180 మంది సభ్యుల హెల్త్ ఇన్సూరెన్స్ కి ఈ మొత్తాన్ని ఉపయోగిస్తామని ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు తెలిపారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లోని సభ్యులకు అందిస్తున్న ఇన్సూరెన్స్ పాలసీల గురించి వై.జె.రాంబాబు.. సుమ కనకాల కు వివరించారు. ఈ సందర్భంగా సుమతో పాటు NATS సభ్యులు శ్రీధర్ అప్పసాని, అరుణ గంటి, బాపు నూతి, ప్రశాంత్ పిన్నమనేని, రాజ్ అల్లాడ లకు కృతఙ్ఞతలు తెలిపింది తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్.

Related Posts