సమ్ థింగ్ స్పెషల్ గా ‘సలార్’ ఇంటర్యూ

తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. అలాగే.. కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్ లో నిలిపిన ప్రశాంత్ నీల్.. మలయాళ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ‘లూసిఫర్’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన పృథ్వీరాజ్.. ఒకే ఫ్రేములోకి వస్తే ఎలా ఉంటుంది. వీరితో పాటు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కలిస్తే.. ఆ ఇంటర్యూ వెరీ వెరీ స్పెషల్. ‘సలార్’ కోసం రాజమౌళి చేసిన ‘ట్రిపుల్ పి.. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్’ ఇంటర్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా దూసుకెళ్తుంది.

అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ‘సలార్’ విడుదలకు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉందనగా ఈ ఇంటర్యూని రిలీజ్ చేసింది టీమ్. దర్శకధీరుడు రాజమౌళి వ్యాఖ్యాతగా.. ‘సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్.. నటులు ప్రభాస్, పృథ్వీరాజ్ లు పాల్గొన్న ఈ ఇంటర్యూలో జక్కన్న సంధించిన ప్రశ్నలు సమ్ థింగ్ స్పెషల్ గా ఉన్నాయి. అసలు ‘కె.జి.యఫ్’ కు ‘సలార్’కు సంబంధం ఉందా?, ‘సలార్’ రెండు పార్ట్స్ గా తీయడానికి కారణాలు ఏంటి?, వేరే దేశాల్లో మన సినిమాకి గుర్తింపు ఉందా?, ‘బాహుబలి’ కంటే ‘కె.జి.యఫ్’ను ఎక్కువ పొగిడేవారా?, మలయాళం ఇండస్ట్రీలో హీరోలు ప్రతీ పాత్రకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు.. వంటి టాపిక్స్ ఈ ఇంటర్యూలో హైలైట్ అని చెప్పాలి.

విడుదలకు కేవలం వారం రోజుల ముందు ప్రచారాన్ని ప్రారంభించిన ‘సలార్’పై క్రేజ్ అయితే మామూలుగా లేదు. శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓ రేంజులో జరుగుతున్నాయి. మరి.. ఫస్ట్ డే ‘సలార్’ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.

Related Posts