కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకున్నా ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్

ఆస్కార్.. సినిమావారికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డ్. ఒక్కసారి ఆస్కార్ సాధిస్తే చాలు.. వారి జన్మ ధన్యమైనట్టుగానే భావిస్తారు. కొన్నాళ్ల క్రితం వరకూ ఇండియాలాంటి దేశాలకు ఇది అందని ద్రాక్ష. కానీ ఇప్పుడు కాదు. గతంలో మన వారికీ అవార్డులు వచ్చాయి. కానీ ఇంత ప్రాచుర్యం లేదు. ఇక లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఆస్కార్ కోసం దేశమంతా ఎదురుచూసింది. ఈ సినిమాకు ఆస్కార్ రావాలని భాషలకతీతంగా ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు సైతం ఈ సారి ఆస్కార్ ఇండియాదే అన్నారు. అంతా కోరుకున్నట్టుగానే తెలుగు సినిమాకు ఇండియన్ సినిమాగా ఆస్కార్ వచ్చేసింది. అయితే ఈ చిత్రానికి పోటీగా కేంద్ర ప్రభుత్వం మరో సినిమాను నిలిపింది అన్న విషయం ఈ సందర్భంగా చాలమంది మర్చిపోయినట్టున్నారు.

నిజానికి ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ ను ప్రభుత్వం తరఫున పంపించలేదు. ఈ చిత్రానికి బదులుగా గుజరాత్ రాష్ట్రంలో రూపొందిన ‘‘చెల్లో షో’’ చిత్రాన్ని ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. అందుకు కారణమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మోదా రాష్ట్రం నుంచి వచ్చిన కాబట్టి ఆ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని చూశారు. బట్ అది ఆల్రెడీ వేరే దేశంలో వచ్చిన చిత్రానికి అనుకరణ అని అప్పుడే జనం తేల్చారు. ఈ కారణంగానే ఈ చెల్లో షో అనే చిన్న చిత్రం వేరే ఏ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు.. అవార్డులు తెచ్చుకోలేదు. బట్ ఆ ప్లేస్ లో ప్రభుత్వం నుంచి కాకుండా వెళ్లిన ఆర్ఆర్ఆర్ తో పాటు ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రాలకు ఆస్కార్ వచ్చింది.


అంటే రాజకీయాలు సినిమాల్లో కూడా ఉంటాయి అని చెప్పేందుకు ఇదో పెద్ద ఉదాహరణ. ఆస్కార్ లాంటి అవార్డ్ కు పంపిస్తున్నప్పుడు.. అది బావుందా లేదా అనే కంటే మనం సొంత క్రియేషనా కాదా అనేదైనా క్లారిటీగా చూసుకోవాలి కదా.. ? కేవలం తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి కాబట్టి పనైపోతుంది అనుకున్నారు. బట్.. అవార్డులు ఇచ్చేది కూడా మనదేశమే కాదు కదా..? అందుకే ఛెల్లో షోకు ఆస్కార్ లో అసలు ప్రాధాన్యతే లేకుండా పోయింది. అలాగే కశ్మీర్ ఫైల్స్ ను ప్రాథమిక దశలోనూ ట్రాష్ గా కొట్టిపడేశారు. సో.. ప్రభుత్వం ఇప్పుడు కంగ్రాట్యులేషన్స్ చెబుతోంది. రాజ్యసభలోనూ ఆస్కార్ విజేతలను పొగిడారు. బట్.. వీరి విజయానికి ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన కనీస సపోర్ట్ కూడా రాలేదు అని నిజం.

Related Posts