ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేశారా..?

ఏదైనా సినిమా అనుకున్న డేట్ ను దాటిపోతే పెద్దగా ఫీలవరు ఫ్యాన్స్. కానీ చెప్పిన డేట్ కు కూడా రాలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఫీలవుతారు. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అభిమానులు ఎదురుచూసి నిరాశపడిన సినిమా ఆర్ఆర్ఆర్. ఫైనల్ గా జనవరి 7 అన్నారు. బట్ అనూహ్యంగా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది. ఇక మళ్లీ రెండు డేట్స్ చెప్పారు. మార్చి 18, ఏప్రిల్ 28. మరి ఈ రెండు డేట్స్ లో ఈ సినిమా ఎప్పుడు రాబోతోందో తెలుసా..?
బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ఇండియన్ ఆడియన్సెస్ ను వెయిట్ చేయిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. మధ్యలో కెజీఎఫ్ వచ్చినా.. ఆ సినిమా చూసిన తర్వాతే జనం ఫ్యాన్స్ అయ్యారు. కానీ ట్రిపుల్ ఆర్ విడుదల కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన సినిమా కావడం.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. వాటిని అందుకోవడం మాకేమంత కష్టం కాదు అనేలా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను తమ సినిమా వైపు చూసేలా చేశారు.
ఆర్ఆర్ఆర్ అనేక సార్లు వాయిదా పడింది. అయినా దసరాకు వస్తుందని భావించారు. వాళ్లూ అనౌన్స్ చేశారు. బట్ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఇక సమ్మర్ కే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిన టైమ్ లో అనూహ్యంగా అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో రాజమౌళి రీ థాట్ పడిపోయి.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. అప్పటికే సంక్రాంతి బరిలో చాలా సినిమాలున్నా.. జనవరి 7న మేం వస్తున్నాం అని చెప్పి అందరినీ వాయిదా వేయించాడు. డేట్ చెప్పిందే తడవుగా.. ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో స్టార్ట్ చేశారు. తీరా చూస్తే జనవరి 7 కూడా మిస్ అయింది. కరోనా కేస్ లు పెరుగుతుండటం, దేశంలో కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో థియేటర్స్ లో 50శాతానికే అనుమతి ఇవ్వడంతో పాటు ఓవర్శీస్ లో కూడా పరిస్థితులు బాలేవనే కారణంతో పోస్ట్ పోన్ చేశారు.
ఇక మరోసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఈ సారి తెలివిగా రెండు డేట్స్ అన్నారు. ఒకటి మార్చి 18 మరొకటి ఏప్రిల్ 28. అయితే ఈ రెండు డేట్స్ లో ఖచ్చితంగా ఎప్పుడు వస్తారు అనే డౌట్ అందరిలోనూ ఉంది. ఆ డౌట్స్ ను క్లియర్ చేస్తూ తాజాగా ఓ స్ట్రాంగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 28నే విడుదల కాబోతోంది. అప్పటికే ఆ డేట్ అనౌన్స్ చేసిన ఎఫ్3 ఆల్రెడీ వాయిదా వేసుకున్నట్టే. ఇక ఏప్రిల్ 1న వస్తోన్న ఆచార్య కూడా ఆగిపోయింది. అంటే ఆర్ఆర్ఆర్ తర్వాతే ఆచార్యను విడుదల చేయాలనే ఓ అనఫీషియల్ కండీషన్ లాంటిది ఉందట. సో.. ట్రిపుల్ ఆర్ సమ్మర్ లోనే సందడి చేయబోతోందని చెప్పొచ్చు.

Related Posts