నిఖార్సైన నిర్మాతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

దిల్ రాజు .. సినిమా నిర్మాణానికి, నిర్మాత అనే పదానికి స్వర్ణయుగపు గౌరవం తెచ్చిన నిర్మాత..నిర్మాతంటే కాంబినేషన్లను నమ్ముతున్న టైమ్ లో వచ్చినా.. ఆయన కథలను మాత్రమే నమ్మాడు.. ఈ విషయంలో నాటి నాగిరెడ్డిని గుర్తుకుతెచ్చారు.. నిన్నటి రామానాయుడును తలపించారు.. రాజుగారికి సినిమా అంటే ఆకాశమంత ప్రేమ.. అందుకే కథలనే నమ్ముతూ భద్రంగా సినిమాలు చేస్తూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బొమ్మరిల్లు కట్టేశారు .. ఆ బొమ్మరిల్లు ఇప్పుడు ఎందరికో పొదరిల్లుగా మారింది .. ఆయన నిర్మాణావరణాన్ని బృందావనంగా మార్చింది..
ఇక సరికొత్త టాలెంట్ ను నమ్మి ప్రోత్సహించడంలోనూ రాజుగారి తర్వాతే ఎవరైనా.. మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ తో.. కుటుంబకథా చిత్రాలు నిర్మించడం.. ఇద్దరు స్టార్ హీరోలు దొరికినా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే టైటిల్ పెట్టడం ఒక్క దిల్ రాజుకే చెల్లింది.. చెల్లుతుంది..
ఆ పర్ఫెక్షనే రాజుగారిని టాప్ ప్రొడ్యూసర్ ను చేసింది.. కొత్త నిర్మాతలకు రోల్ మోడల్ గా మార్చింది.. ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్ ను కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ విస్తరిస్తూ తనకే సొంతమైన పర్ఫెక్ట్ మేకింగ్ ను కంట్రీ మొత్తానికి చూపించబోతోన్న దిల్ రాజుగారికి తెలుగు కళామతల్లి శతమానం అనే కాదు ప్రతి సినిమాకూ శతదినోత్సవం భవతీ అంటూ దీవించాలని… రాజుగారు దేశవ్యాప్తంగా మరిన్ని మహా విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ కు హ్యాపీ బర్త్ డే చెబుదాం..

Related Posts