HomeLatest‘ఆర్.సి.16‘ కోసం రంగంలోకి రత్నవేలు

‘ఆర్.సి.16‘ కోసం రంగంలోకి రత్నవేలు

-

ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‘ సినిమాతో బిజీగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత తన 16వ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడు. ‘ఉప్పెన‘ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ చిత్రంకోసం ఒకవైపు నటీనటులు .. మరోవైపు సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు.

ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ అయితే.. ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు పరిశీలనలో ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఆద్యంతం ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో నటించేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన చాలామంది నటీనటులను ఎంపిక చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో నటీనటుల వేట సాగించారు.

టెక్నికల్ ఫ్రంట్ లో ‘ఆర్.సి.16‘ కోసం ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఇప్పటికే ఆన్ బోర్డులోకి వచ్చాడు. లేటెస్ట్ గా పాపులర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలును ఈ చిత్రంకోసం తీసుకున్నారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి పట్టా పొందిన రత్నవేలు.. తమిళంలో ఎన్నో అవార్డు చిత్రాలకు పనిచేశాడు. ఇక.. బుచ్చిబాబు గురువు సుకుమార్ తొలి చిత్రం ‘ఆర్య‘ నుంచి ‘రంగస్థలం‘ వరకూ ఇతని ప్రయాణం కొనసాగింది. ప్రస్తుతం ‘దేవర‘కి వర్క్ చేస్తున్న రత్నవేలు.. ‘ఆర్.సి.16‘ కోసం ఆన్ బోర్డులోకి వచ్చాడు. ఈరోజు (ఫిబ్రవరి 24) రత్నవేలు పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్.సి.16‘ టీమ్ లోకి ఈ గ్రేట్ సినిమాటోగ్రాఫర్ కి వెల్కమ్ చెబుతూ ట్వీట్ చేసింది చిత్రబృందం.

ఇవీ చదవండి

English News