రణ్ బీర్ కి విలన్ గా మారుతోన్న రణ్ వీర్?

ప్రస్తుతం అంతటా మూవీ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒకే చిత్రాన్ని రెండు, మూడు భాగాల్లో చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈకోవలోనే బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర‘ను మూడు భాగాలుగా తీసుకురాబోతున్నామని ముందే ప్రకటించారు. ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన ఫస్ట్ పార్ట్ ‘శివ‘కి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం ఫర్వాలేదనిపించాయి. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర‘ సెకండ్ పార్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. కరణ్ జోహార్ నిర్మాణంలో అయన్ ముఖర్జీ దర్శకుడిగా ‘బ్రహ్మాస్త్ర 2‘కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.

ప్రస్తుతం ‘వార్ 2‘తో బిజీగా ఉన్న అయన్ ముఖర్జీ.. ఆ తర్వాత ‘బ్రహ్మాస్త్ర 2‘ని పట్టాలెక్కించనున్నాడు. ‘బ్రహ్మాస్త్ర‘ సెకండ్ పార్ట్ కి ‘దేవ‘ అనే టైటిల్ ని నిర్ణయించారు. ఆ టైటిల్ రోల్ కోసం గతంలో హృతిక్ రోషన్, యష్ వంటి పేర్లు వినిపించాయి. లేటెస్ట్ గా ‘దేవ‘ రోల్ కి రణ్ వీర్ సింగ్ ని ఫైనలైజ్ చేశారట. రణ్ బీర్ కపూర్ పోషించిన శివ పాత్రకు తండ్రి పాత్ర ఇది. అయితే ఈ రోల్ పూర్తిగా నెగటివ్ షేడ్స్ తో ఉండబోతున్నట్టు ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1‘లోనే హింట్ ఇచ్చారు మేకర్స్. రణ్ బీర్ కపూర్ తల్లిగా దీపిక పదుకొనె నటించబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని 2026లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts