రాజశేఖర్ కు గట్టి షాకే ఇచ్చారుగా..

యాంగ్రీమేన్ రాజశేఖర్ లేటెస్ట్ మూవీ శేఖర్ పై బ్రహ్మాస్త్రం పడింది. ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి వీల్లేదని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా కోసం శేఖర్ చిత్రానికి నిర్మాత, దర్శకురాలు అయిన జీవిత తమవద్ద నుంచి 65లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందని, సినిమా విడుదలకు దగ్గరవుతున్నా తిరిగి చెల్లించలేదని ఆరోపిస్తూ.. ఏ పరంధామ రెడ్డి అనే ఫైనాన్సియర్ సిటీ సివిల్ కోర్ట్ లో పిటిషన్ వేశాడు. తర్వాత 48గంటల్లోగా జీవిత రాజశేఖర్ సదరు అప్పును తీర్చాలని.. లేని పక్షనంలో ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రదర్శనలు చేయరాదని ఆదేశాలిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారో లేక ఇంకేదైనా ఆధారం ఉందో కానీ జీవిత రాజశేఖర్ అప్పుడు చెల్లించలేదు. దానికి సంబంధించి ఎటువంటి హామీలూ ఇవ్వలేదు. దీంతో కోర్ట్ తీర్పును అమలు చేస్తూ ఈ ఆదివారం మధ్యాహ్నం నుంచి శేఖర్ సినిమా ప్రదర్శనలను అన్ని థియేటర్స్ లో నిలిపివేశారు.

ఈ పరంధామద రెడ్డి దంపతులు కొన్నాళ్లుగా ఈ వ్యవహారం గురించి చెబుతూనే వస్తున్నారు. అయితే విషయం కోర్ట్ లో ఉంది కాబట్టి మేమేమీ స్పందించం అంటూ చెబుతూ వచ్చారు రాజశేఖర్ దంపతులు. మరోవైపు ఈ సినిమా నిర్మాతను తానంటూ.. తన సినిమాను ఆపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఒక వ్యక్తి ప్రెస్ మీట్ లో చెప్పాడు. అయినా కోర్ట్ పరంధామరెడ్డి వైపే నిలిచింది. శేఖర్ చిత్ర ప్రదర్శనను నిలిపివేసింది. మరి దీనిపై జీవిత రాజశేఖర్ ల తర్వాతి స్టెప్ ఏంటో కానీ.. కొన్నాళ్లుగా వీరికి ఇలాంటి వ్యవహారాలు కామన్ అయిపోయాయనే చెప్పాలి.

Related Posts