ఎఫ్3 నవ్విస్తుందా లేక నవ్వుల పాలవుతుందా..

ఎఫ్3 హిట్టు.. విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్ లో ఉంటుందని సినిమా పరిశ్రమలో ఓ సెటైర్ ఉంది. అన్నిసార్లూ కాదు కానీ కొన్నిసార్లు ఇవి నిజమవుతాయి. ఇంకా చెబితే ఇలా ప్రమోషన్స్ లో మరీ మోసేసుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోవడం ఈ మధ్య కాలంలో కూడా చూశాం. ఆ రూట్ లోనే ఇదీ ఉంటుందని కాదు కానీ.. ఎఫ్3 విషయంలో కూడా ఇలాంటివి విపరీతంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా తామో అద్భుతాన్ని క్రియేట్ చేశాం అన్నట్టుగా చెబుతున్నారు. అనిల్ రావిపూడి అయితే వెళ్లిన ప్రతి చోటా తనలోని దర్శకుడి కంటే ఎక్కువగా నటుడు, డ్యాన్సర్ ను ప్రదర్శిస్తూ.. ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే భజన కార్యక్రమానికి తక్కువ అనకుండా ఉంది. ఎవరికి వారు ఓ రేంజ్ లో సినిమాను గురించి చెప్పేశారు..

అటు వెంకటేష్ కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగా చేస్తున్నాడు. ఎఫ్2 విజయం సాధించింది. అలాగే సీక్వెల్(కాదని వాళ్లంటున్నారు. అప్పుడు ఎఫ్3 అని పెట్టడం ఎందుకో) అంతకు మించిన విజయం సాధిస్తుందనేది వారి వెర్షన్. సాధిస్తే మంచిదే. కానీ విషయం అంత క్లియర్ గా ఉన్నప్పుడు మరీ ఇంత విపరీతమైన ప్రమోషన్స్ ఎందుకు అనేది జనరల్ ఆడియన్స్ వెర్షన్.
నిజానికి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన అన్ని చిత్రాల్లోనూ సెకండ్ హాఫ్ ప్రతిసారీ వీక్ గానేఉంది. అంతెందుకు ఎఫ్2లో కూడా అదే పరిస్థితి. ఆ టైమ్ లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలవడంతో ఈ చిత్రానికి 100 కోట్ల లెక్క కలిసొచ్చింది కానీ.. ఆ సెకండ్ హాఫ్ చీప్ గానే ఉంటుందనేది అందరికీ తెలుసు. అంతెందుకు.. సరిలేరు నీకెవ్వరు కూడా సెకండ్ హాఫ్ చాలా వీక్ గా కనిపిస్తుంది. ఈ వీకెనెస్ అనిల్ అన్ని సినిమాల్లోనూ ఉంది. అందుకే ఎఫ్3 పై కాదు కానీ.. వీళ్లు చేస్తోన్న లేదా పెంచుతోన్న ఓవర్ హైప్ పై అనుమానాలు వస్తున్నాయంటున్నారు చాలామంది.

మరోవైపు తెరనిండా ఆర్టిస్టులున్నా.. వారిని భరించడం అన్నిసార్లూ సాధ్యం కాదు. షార్ప్ గా ఉండే కథలను ఎక్కువగా ఇష్టపడుతోన్న కాలం ఇది. ఇలాంటి టైమ్ లో అంతమంది ఆర్టిస్టులను మేనేజ్ చేయడం.. వారి పాత్రలన్నీ బావుండేలా తీర్చిదిద్దడం అంత సులువు కాదు. కొన్నిసార్లు సినిమా బావున్నా.. ఫలానా పాత్రలు లేకపోతే ఇంకా బావుండేది అనే టాక్స్ కూడా వస్తుంటాయి. మరి ఇన్ని టాక్స్ నేపథ్యంలో ఈ నెల 27న వస్తోన్న ఎఫ్3 నవ్విస్తుందా లేక నవ్వుల పాలవుతుందా అనేది చూడాలి.

Related Posts