Raj : ప్రముఖ సంగీత ద్వయం ‘రాజ్-కోటి’ లో రాజ్ మృతి

80, 90 దశకాలను తమదైన సంగీతంతో ఉర్రూతలూగించిన ద్వయం రాజ్ – కోటి. వీరిలో రాజ్ ఈ ఆదివారం మరణించారు.

రాజ్ కోటిగా తెలుగు సినిమా సంగీతానికి ఎనలేని కృషి చేసిన ఈ ద్వయం 1995 తర్వాత మనస్ఫర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత కోటి తనదైన శైలిలో రాణించినా.. రాజ్ ఎందుకో చాలా వెనకబడిపోయారు. ఆయ ఒక్కడుగా కేవలం పది చిత్రాలకు మాత్రమే సంగీతంఅందించారు. వీటిలో సిసింద్రీ సూపర్ హిట్ కాగా వెంకటేష్‌, ప్రీతి జింతా నటించిన ప్రేమంటే ఇదేరా చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు. ఆయన చివరి చిత్రం 2002లో వచ్చిన లగ్నపత్రిక.


రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఈయన తండ్రి కూడా ప్రఖ్యాత సంగీత దర్శకుడే. పేరు టివి రాజు. నాటి ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఎన్టీఆర్ – టివి రాజు కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ గా వచ్చారు. అలాంటి తండ్రి వారసత్వంతో తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించారు రాజ్. చిత్రంగా అతనికి తన లాగే సంగీత వారసత్వం ఉన్న కోటితో పరిచయం కలిగింది. ఈ పరిచయంతో ఇద్దరూ కలిసి సంగీతం అందించాలని నిర్ణయించుకున్నారు. ఇక కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు సంగీత ప్రియులందరికీ సుపరిచితులే.
1982లో వచ్చిన ప్రళయ గర్జన చిత్రంతో ఇద్దరూ కలిసి సంగీత ప్రయాణం మొదలుపెట్టారు. చిత్రంగా వీరికి దాదాపు ఆరేళ్లపాటు సరైన బ్రేక్ రాలేదు. అయినా అడపాదడపా ఆఫర్స్ తో ఆకట్టుకుంటోన్న దశలో చిరంజీవితో చేసిన యముడికి మొగుడు మూవీ ఆల్బమ్ బ్లాక్ బస్టర్.

ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి తెలుగు సినిమా సంగీతాన్ని శాసించారనే చెప్పాలి. అయితే వీరిలో కోటి కాస్త మాటకారి. ఎవరితోనైనా సులువుగా కలిసిపోతాడు. కానీ రాజ్అలా కాదు. అంతర్ముఖుడు. అందుకే రాజ్ కోటిగా ఎంతో మందికి తెలిసినా.. కోటిలా అన్ని తరాల ప్రేక్షకులకు రాజ్ తెలియదు.
ఇక రీసెంట్ గా కూడా బేబీ అనే సినిమాకు సంబంధించిన ఓ పాట లాంచింగ్ కు కోటితోకలిసి వచ్చారు రాజ్. ఈ ఆదివారం రోజు బాత్ రూమ్ లో కాలు జారి పడిపోయారు. ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. ఆ క్రమంలో పెద్ద శబ్ధం వచ్చింది. ఆ శబ్ధానికి ఆయనకు గుండెపోటు కూడా వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లినా ఉపయోగం లేకపోయింది. మొత్తంగా తెలుగులో నేటికీ వినిపించే ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ తో తిరుగులేని ముద్ర వేసిన సంగీత ద్వయంలో ఒకరైన రాజ్ ఆత్మకు శాంతి కలగాలని తెలుగు 70ఎమ్ఎమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Telugu 70mm

Recent Posts

జూన్ లో విడుదలకు ముస్తాబవుతోన్న ‘రాయన్’

ఈతరం యువ కథానాయకుల్లో రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక నటుడు ధనుష్. కేవలం కథానాయకుడుగానే కాకుండా…

3 mins ago

‘Satya’ trailer.. A love story with naturalness

New age romantic love stories are always well received. And.. Tamilians show special attention in…

16 mins ago

‘ప్రతినిధి 2’కి సెన్సార్ ఇబ్బందులేంటి?

ప్రస్తుతం యావత్ దేశంలో ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ లో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలు…

23 mins ago

అతిథి పాత్రకోసం ఆరు కోట్లు పారితోషికం

మంచు విష్ణు నటిస్తూ నిర్మాస్తోన్న మెగా ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘. శివ భక్తుడు కన్నప్ప కథాంశంతో అత్యంత భారీ బడ్జెట్ తో…

2 hours ago

‘ఆహా‘లో రానున్న ‘విద్య వాసుల అహం’

‘కోట బొమ్మాళి పి.ఎస్‘ సినిమాతో మంచి విజయాన్నందుకున్న రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘విద్య వాసుల…

2 hours ago

మే 10న బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర

ఈ వేసవిలో ఇప్పటివరకూ ఒకటీరెండు సినిమాలు తప్ప.. పెద్దగా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలైతే రాలేదు. ఒకవైపు ఎన్నికల వేడి.. మరోవైపు…

2 hours ago