పంచ‌తంత్ర క‌థ‌లు ను ప్రశంచించిన రాఘ‌వేంద్ర‌రావు

మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మించిన చిత్రం పంచ‌తంత్ర క‌థ‌లు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, నిహాల్ కోద‌ర్తి, అజ‌య్ క‌తుర్వ‌ర్, గీతా భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, సాదియ‌ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఐదు క‌థ‌ల స‌మాహారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం మ‌న తెలుగు ఓటీటీ అయిన ఆహాలో విశేష ఆద‌ర‌ణతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఈ చిత్రాన్ని ప్ర‌శంసించారు. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమా వీక్షించారు. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ – ఈ మధ్య ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న పంచతంత్ర కథలు చూశాను. దాని గురించి ఐదు మాటల్లో చెబుతాను. దర్శకుడు, కెమెరామేన్‌ ఒకరే కనుక చాలా అద్భుతమైన చిత్రీకరణ జరిగింది. మంచి, మంచిలొకేషన్స్, మంచి మ్యూజిక్, మంచి మాటలు, మంచి సెలక్షన్‌ ఆఫ్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కుదిరింది. రెండోవది...కులవ్యవస్థ గురించి, పెద్ద కులం, చిన్న కులం కాకుండా...ప్రేమకు కులాలు అడ్డురావు అనే అంశాన్ని చాలా సున్నితంగా, ఎక్కువ మెలో డ్రామా లేకుండా చాలా చక్కగా తీశాడు. నటీనటులు కూడా చాలా చక్కగా చేశారు. కచ్చితంగా చూడాల్సిన ఎపిసోడ్‌ ఇది. మూడోపాయింట్‌..

అహల్య అనే మరో షార్ట్‌ స్టోరీలో..తన బిడ్డను పోషించుకోవడం కోసం వ్యభిచారిణిగా మారిన అమ్మాయి, పెయింటర్‌ మధ్య జరిగే ఎపిసోడ్‌ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అందులో హీరో హీరోయిన్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. హృదయానికి హత్తుకునేలా చిన్న చిన్న మాట‌ల‌తో చాలా చ‌క్క‌గా చిత్రీకరించాడు ద‌ర్శ‌కుడు. నాలుగ‌వ పాయంట్‌.. త‌రుణ్ భాస్క‌ర్ త‌ల్లి గీతా భాస్క‌ర్‌గారు ఇద్ద‌రు కొడుకులు ఉండ‌డంతో ఏ ఇంట్లో ఉండాలి అనే విష‌యం ఎంతో సున్నితంగా..ఎంతో ఆలోచింప‌జేసే విధంగా తీశారు. గీత భాస్క‌ర్ గారు చాలా నేచుర‌ల్‌గా చేశారు. పంచ‌తంత్ర క‌థ‌లు అని పేరు పెట్టినందుకు ఐదు చ‌క్క‌టి క‌థ‌ల్ని క‌మ‌ర్షియాలిటీ లేదేంటి?.. ఫైట్లు గ‌ట్రా లేవేంటి? అనే ఆలోచ‌న లేకుండా నిర్మించిన నిర్మాత మ‌ధుకి ఈ సినిమా మ‌రింత మంచి విజ‌యం సాధించి మునుముందు ఇంకా మంచి సినిమాలు తీయాల‌ని కోరుకుంటున్నా..అలాగే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్‌, మిగ‌తా ఆర్టిస్టుల‌కి కూడా మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు పంచ‌తంత్ర క‌థ‌లు టీమ్‌ అన్నారు.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

2 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

2 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

3 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

8 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

8 hours ago