పంచ‌తంత్ర క‌థ‌లు ను ప్రశంచించిన రాఘ‌వేంద్ర‌రావు

మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మించిన చిత్రం పంచ‌తంత్ర క‌థ‌లు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, నిహాల్ కోద‌ర్తి, అజ‌య్ క‌తుర్వ‌ర్, గీతా భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, సాదియ‌ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఐదు క‌థ‌ల స‌మాహారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం మ‌న తెలుగు ఓటీటీ అయిన ఆహాలో విశేష ఆద‌ర‌ణతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఈ చిత్రాన్ని ప్ర‌శంసించారు. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమా వీక్షించారు. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ – ఈ మధ్య ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న పంచతంత్ర కథలు చూశాను. దాని గురించి ఐదు మాటల్లో చెబుతాను. దర్శకుడు, కెమెరామేన్‌ ఒకరే కనుక చాలా అద్భుతమైన చిత్రీకరణ జరిగింది. మంచి, మంచిలొకేషన్స్, మంచి మ్యూజిక్, మంచి మాటలు, మంచి సెలక్షన్‌ ఆఫ్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కుదిరింది. రెండోవది...కులవ్యవస్థ గురించి, పెద్ద కులం, చిన్న కులం కాకుండా...ప్రేమకు కులాలు అడ్డురావు అనే అంశాన్ని చాలా సున్నితంగా, ఎక్కువ మెలో డ్రామా ల