గోపీచంద్ తో ‘రాధేశ్యామ్’ దర్శకుడు భారీ చిత్రం

‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘రాధేశ్యామ్’ డిజాస్టర్ గా మిగిలింది. వరుసగా యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో అలరించిన ప్రభాస్.. రొమాంటిక్ అవతార్ లో నటించిన సినిమా ఇది. అయితే..

యూరప్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పీరయడ్ డ్రామా ఆడియన్స్ కి ఏమాత్రం కనెక్ట్ కాలేదు. దీంతో.. నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కు సైతం భారీ స్థాయిలో నష్టాలు తప్పలేదు.

అయినా.. తమ కాంపౌండ్ లో ‘జిల్, రాధేశ్యామ్’ వంటి వరుస సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణకు మరో అవకాశం ఇస్తుందట యు.వి.క్రియేషన్స్. ఈసారి గోపీచంద్ హీరోగా రాధాకృష్ణ సినిమా చేయబోతున్నాడట. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమాని భారతదేశంతో పాటు.. విదేశాల్లోనూ ఎక్కువ భాగం చిత్రీకరణ చేయనున్నారట. అలా.. ‘రాధేశ్యామ్’ తర్వాత రాధాకృష్ణ మరో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ ‘భీమా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఇక.. త్వరలోనే గోపీచంద్-రాధాకృష్ణ చిత్రం పట్టాలెక్కనుందట.

Related Posts