‘ది ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్స్ షురూ

‘గీత గోవింతం’ వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’. ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండకి జోడీగా లక్కీ ఛార్మ్ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇటీవలే ‘ది ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టీమ్.. ఇప్పుడు పాటల సందడి మొదలుపెట్టింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘నందనందన’ ఫిబ్రవరి 7న రాబోతుంది. లేటెస్ట్ గా అందుకు సంబంధించి ప్రోమో రిలీజయ్యింది.

‘గీత గోవిందం’ చిత్రంలో ‘ఇంకేం ఇంకేం కావాలే’ సాంగ్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. మళ్లీ అదే కాంబో.. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్, లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిద్ శ్రీరామ్ కలయికలో ‘నందనందన’ గీతం రాబోతుంది. ప్రోమో అయితే చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. ఫుల్ సాంగ్ ఏరీతిన అలరిస్తుందో చూడాలి.

Related Posts