ప్రభాస్ ఇన్సిపిరేషన్ తోనే రాధే శ్యామ్ తెరకెక్కించా – దర్శకుడు రాధాకృష్ణ కుమార్

రాధే శ్యామ్ లాంటి మూవీ చేసినందుకు గర్వంగా ఉందన్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ప్రభాస్ ఇచ్చిన ఇన్సిపిరేషన్ తోనే ఇంత భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగలిగానని రాధాకృష్ణ కుమార్ చెప్పారు. ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రాధే శ్యామ్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడుతూ .. నిర్మాత కృష్ణం రాజు గారు సపోర్ట్ గా నిలిచారు. ట్రైలర్ చూసిన వారంతా ట్రైలర్ లో వి.యఫ్.ఎక్స్ బాగుంది అంటున్నారు. ఇదంతా కమల్ కన్నన్ కె దక్కుతుంది. నాకు ఇన్స్పిరేషన్ ప్రభాస్ గారే. ప్రభాస్ ని నేను ఎంతో ఇష్టపడతాను. 1970 లలో సాగే పీరియాడిక్ మూవీ ఇది. 5 బాషల్లో తీయడం అంటే గొప్ప విషయం. సంక్రాంతి శుభాకాంక్షలతో రాధే శ్యామ్ జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్నారు

Related Posts