పుష్ప నిర్మాతలు కూడా తగ్గేదే లే అంటున్నారుగా..?

ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ నిర్మాతకు వచ్చే ఆనందం వేరే. అదే సినిమాకు సీక్వెల్ కూడా తీయాలంటే ఈ ఆనందం డబుల్ అవుతుంది. ఇంకాస్త జోష్ గా కనిపిస్తారు. అందుకే ఇంతకు ముందు లేని ఎపిసోడ్, షెడ్యూల్ ను దర్శకుడు ప్లాన్ చేసినా కామ్ గా కాసులు తీస్తున్నారు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు .. నీయవ్వ తగ్గేదే లే అంటూ నిర్మాతలు కూడా గెడ్డం కింద చేయి పెట్టి తిప్పేస్తున్నారట.

అందుకే ఇప్పుడు పుష్ప2 బడ్జెట్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. పుష్పతో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్. అనూహ్యంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగానూ ఓటిటిల ద్వారా తిరుగులేని క్రేజ్ వచ్చింది. పుష్ప మేనరిజమ్స్ ను స్పోర్స్ మెన్ నుంచి హాలీవుడ్ యాక్టర్స్ వరకూ ఇమిటేట్ చేసి ఆ విషయంలోనూ తగ్గేదే లే అనేసుకున్నారు. అంత క్రేజ్ వచ్చిన చిత్రానికి సీక్వెల్ తీయడం అంటే దర్శకుడిపై వెయిట్ పెరుగుతుంది.

అంచనాలూ భారీగా ఉంటాయి. వాటిని అందుకోవడానికి అనేక తంటాలు పడాల్సి ఉంటుంది. అందుకే రీసెంట్ గా స్క్రిప్ట్ పూర్తయిన టైమ్ లో లేని ఓ కొత్త ఎపిసోడ్ ను రీసెంట్ గా ప్లాన్ చేసుకుని రాసుకున్నారట. అది అద్బుతంగా ఉంది అనిపించడంతో వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. బట్ ఇందుకోసం మేజర్ టీమ్ అంతా థాయ్ లాండ్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ రెండు వారాల షూటింగ్ ఉంటుంది. అంటే ఖర్చు భారీగానే ఉంటుంది.


పుష్ప పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే రెడ్ శాండల్ స్మగ్లర్స్ కథ కాబట్టి.. ఈ పుష్పరాజ్ తన సామ్రాజ్యాన్ని థాయ్ లాండ్ వరకూ విస్తరించుకుంటూ వెళితే.. అక్కడి లోకల్ స్మగ్లర్స్ మనోడిపై మర్డర్ ఎటెంప్ట్ చేస్తారు. ఆ ఫైట్ నే ఇప్పుడు అక్కడ షూట్ చేయబోతున్నారు.ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందంటున్నారు.

మొత్తంగా పుష్ప బడ్జెట విషయంలో నిర్మాతలు ఏ మాత్రం తగ్గడం లేదట. అందుకు మరో కారణమూ లేకపోలేదు. ఈ చిత్రాన్ని ఇప్పుడు రష్యాలో విడుదల చేయబోతున్నారు. త్వరలోనే అల్లు అర్జున్ తో పాటు సుకుమార్, నిర్మాతలు కూడా వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేయబోతున్నారు. అక్కడ కూడా ఈ మూవీ వర్కవుట్ అయితే ప్రాఫిట్స్ పెరుగుతాయి కదా. వాటిని సెకండ్ పార్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ ఇబ్బందీ లేదనేది నిర్మాతల వెర్షన్ కావొచ్చు. ఏదేమైనా ఓ స్మగ్లర్ కథ ఈ రేంజ్ లో వెళ్లడం ఆశ్చర్యమే.

Related Posts