Ram charan : బాబాయ్ పై అబ్బాయ్ ప్రశంసలు

మెగా ఫ్యాన్స్ ఎలా ఉన్నా.. ఆ ఫ్యామిలీ మొత్తం బానే ఉంటారు అనేది నిజం. ఈ మధ్యలో కొందరు అభిమానులు మాత్రమే మా హీరో అంటూ రకరకాలుగా పోట్లాడుకుంటారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్లు మాత్రం తమ సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఒకరినొకరు అప్రిసియేట్ చేసుకుంటూనే ఉంటారు.

లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో గ్లింప్స్ కు యూ ట్యూబ్ మొత్తం షేక్అవుతోంది. ఈ సారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కే కాదు.. ఇండస్ట్రీకే పూనకాలు తెప్పించింది. హరీష్‌ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత పవన్ – హరీష్‌ కాంబోలో సినిమా రాబోతోంది. దీంతో అభిమానుల్లో కూడా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.


ఇక లేటెస్ట్ గా ఈ గ్లింప్స్ అద్దిరిపోయిందని చెబుతూ రామ్ చరణ్‌ ట్వీట్ చేశాడు.పవన్ కు బయటే కాదు.. ఇంట్లోనూ సూపర్ ఫ్యాన్స్ ఉన్నారని అందరికీ తెలుసు. అందులో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. అందుకే బాబాయ్ వీడియో గ్లింప్స్ కు ఫిదా అయిపోయి ” లవ్ ది మాసివ్ గ్లిప్స్, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూస్తానా అని ఆగలేకపోతున్నాను.. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్” అంటూ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం చరణ్‌ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఏదేమైనా పవన్ ఫామ్ లో ఉంటే ఆయన్ని ఆపడం ఎవరి వల్లా కాదు అనే చెప్పాలి

Telugu 70mm

Recent Posts

‘Heeramandi’ on Netflix from tomorrow

'Heeramandi' is the first web series created by the big Bollywood director Sanjay Leela Bhansali.…

6 hours ago

‘పుష్ప’రాజ్ స్వాగ్ మామూలుగా లేదు

'పుష్ప 2' ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ క్రేజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్…

6 hours ago

Kamal with two films in a gap of two weeks

Universal star Kamal Haasan came into super form with the hit 'Vikram'. With this movie,…

8 hours ago

రెండు వారాల గ్యాప్ లో రెండు సినిమాలతో కమల్

‘విక్రమ్‘ హిట్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు విశ్వనటుడు కమల్ హాసన్. ఈ సినిమాతో కనీవినీ ఎరుగని కలెక్షన్ల…

8 hours ago

రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘హీరామండి‘

బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి‘. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటేనే…

8 hours ago

Crazy teaser coming from ‘Kalki’?

Rebel Star's most awaited 'Kalki 2898 A.D.' release is just two months away. Kalki is…

8 hours ago