పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన ప్ర‌భాస్..

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన వీడియో..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంట‌గా నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ భారీ పీరియాడిక్ మూవీని యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించింది. బాహుబ‌లి, సాహో త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 11న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రాధేశ్యామ్ రిలీజ్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ ముంబాయిలో చాలా గ్రాండ్ గా జ‌రిగింది.

ఈ ఈవెంట్ లో ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న డార్లింగ్ ప్ర‌భాస్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో చెప్పేశాడు. ఈ మూవీ ట్రైలర్ లో పూజా ప్రేమ విషయంలో ఆదిత్య అంచనా తప్పు అనే డైలాగ్ ని తీసుకొని ఒక రిపోర్టర్ .. నిజ జీవితంలో అలా జ‌రిగిందా..? ఇంత‌కీ.. మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో మీరు ఉహించారా..? అని అడిగింది.

ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్.. ప్రేమ విషయంలో నా అంచనాలు.. జీవితంలో ఎప్పుడూ విఫలమవుతూనే వచ్చాయి.. అందుకే నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. ప్ర‌భాస్ న‌వ్వుతూనే చెప్పిన‌ప్ప‌టికీ… ల‌వ్ లో ఫెయిల్ అయ్యాడని.. అందుకే పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పెళ్లి గురించి ప్ర‌భాస్ చెప్పిన ఈ మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మ‌రి.. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడో..? ఎవ‌ర్ని పెళ్లి చేసుకుంటాడో..? చూడాలి.

Related Posts