HomeLatestPrabhas : ప్రభాస్ రామాయణం మూడు గంటలు

Prabhas : ప్రభాస్ రామాయణం మూడు గంటలు

-

ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. భారత ఇతిహాసం రామయణ కావ్యంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్అలీఖాన్ రావణుడుగా కనిపించబోతున్నాడు.

కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ తో ఈ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. విఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ అత్యంత నాసిరకంగా ఉన్నాయని సెటైర్స్, విమర్శలు ఓ రేంజ్ లో వినిపించాయి. దీంతో మళ్లీ మొత్తం వర్క్ చేసుకుని జూన్ 16 నుంచి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఆ నెగెటివిటీ మొత్తం పోయిందనే చెప్పాలి. అలాగని భారీ అంచనాలేం లేవు. కాస్త పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పైగా ఇప్పుడు దేశంలో రాముడు మోస్ట్ సేలబుల్ గా మారాడు కాబట్టి.. ప్రభాస్ కు అది మరింత ప్లస్ అవుతుంది.

ఓమ్ రౌత్ డైరెక్షన్ లో నలుగురైదుగురు నిర్మాతలు రూపొందించిన ఈ చిత్రం రన్ టైమ్ మూడు గంటలు. ఖచ్చితంగా చెబితే 2 గంటల 54 నిమిషాలట. బావుంటే రన్ టైమ్ పెద్ద మేటర్ కాదని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. కాకపోతే తెలుగువారికి రాముడన్నా, కృష్ణుడు అన్నా ఒక రూపం మదిలో ఉంటుంది.

ఇటు చూస్తే ఆదిపురుష్‌ లోప్రభాస్ పూర్తిగా నార్త్ వారి రాముడులా కనిపిస్తున్నాడు. పైగా పేరు కూడా రాముడు అని కాకుండా రాఘవ అంటున్నారు వాళ్లు. మరి రాఘవ తెలుగు వారితో పాటు దక్షిణాది ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

ఇవీ చదవండి

English News