సంక్రాంతికి ప్రభాస్-మారుతి మూవీ ఫస్ట్ లుక్

ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిజీయెస్ట్ స్టార్. పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ తో అలరిస్తున్న రెబెల్ స్టార్.. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా ముహూర్తాన్ని పూర్తిచేసుకున్న ఈ మూవీ.. గుట్టు చప్పుడు కాకుండా పూర్తవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇప్పటివరకూ చూడనటువంటి ఓ కొత్త అవతార్ లో ప్రభాస్ ను ప్రెజెంట్ చేస్తున్నాడట మారుతి. ఇక.. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Related Posts