మాస్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేస్తోన్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నుంచి థర్డ్ సింగిల్ రాబోతుంది. ఈసారి మహేష్ ఊర మాస్ అవతార్ లో మాసీ స్టెప్స్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు. తమన్ సంగీతంలో ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ రామజోగయ్య శాస్త్రి మాసీ లిరిక్స్ తో రాసిన ఈ పాట ప్రోమో రిలీజయ్యింది. హీరోహీరోయిన్స్ మహేష్, శ్రీలీల తమ మాస్ స్టెప్స్ తో ఈ సాంగ్ లో మెస్మరైజ్ చేస్తున్నారు. ఫుల్ సాంగ్ రేపు రిలీజ్ కాబోతుంది.

ఇప్పటివరకూ ‘గుంటూరు కారం’ నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్సే వచ్చినా.. ఓ రేంజులో ట్రెండింగ్ మాత్రం కాలేదు. అయితే.. ఈ మాస్ సాంగ్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతుందని ఇప్పటికే ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘గుంటూరు కారం’ ప్రచారంలో ఇకపై స్పీడు పెంచబోతుంది టీమ్. జనవరి మొదటి వారంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts