జిగేల్ రాణిలా మరోసారి రెచ్చిపోతోన్న పూజాహెగ్డే

ఒకప్పుడు సినిమాల్లో ఐటమ్ సాంగ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన ఐటమ్. అందుకోసం క్రేజీ బ్యూటీస్ కూడా ఉండేవారు. కొన్నాళ్లుగా ఈ ట్రెండ తగ్గింది. ఐటమ్ సాంగ్స్ కు అంత ప్రాధాన్యత కనిపించడం లేదు. ఉన్నా.. హీరోయిన్లే చేస్తున్నారు. దీనివల్ల ఐటమ్ గాళ్స్ ఉపాధిపోతున్నా.. హీరోయిన్లు చేయడం వల్ల ఆ పాటకు మరింత క్రేజ్ యాడ్ అవుతోంది. ఆ క్రేజ్ కోసమే.. టాలీవుడ్ టాప్ బ్యూటీతో మరో ఐటమ్ సాంగ్ చేయించారు.. ఎఫ్3 మేకర్స్.
పూజాహెగ్డే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతోన్న బ్యూటీ. రెమ్యూనరేషన్ పరంగానూ అమ్మడు ఓ రేంజ్ లో వసూలు చేస్తుంది. అయినా ఐటమ్ సాంగ్ అనగానే ఎగిరి గంతేస్తుంది. ఎందుకో తెలుసా.. ఒక్క పాటకే సగం సినిమాకు వచ్చినంత రెమ్యూనరేషన్ వస్తుంది కాబట్టే. రంగస్థలంలో తను చేసిన జిగేల్ రాణి పాటకు మంచి క్రేజ్ వచ్చింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తన రేంజ్ ఇంకా పెరిగింది. నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది.అయినా ఐటమ్ సాంగ్ చేసిందంటే కారణం ఇదే తప్ప మరోటి కాదంటారు కొందరు.
పూజాహెగ్డే ఆ మధ్య వరుసగా మూడు ఫ్లాపులు చూసింది. మొదటిది రాధేశ్యామ్. రెండోది బీస్ట్.. తర్వాత ఆచార్య. రాధేశ్యామ్ లోతను కీలకమే. బట్ సినిమా పోయింది. బీస్ట్ లో హీరోయిన్ కు తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఎక్కువ అనేలా ఉంది. పైగా ఇందులోని పాట కూడా ఓ ఐటమ్ సాంగ్ లానే ఉంటుంది తప్ప హీరోహీరోయిన్ల మధ్య పాటలా కనిపించలేదు. ఆచార్యలో తన పాత్రకు ప్రాధాన్యత లేదు. అయినా సినిమాలో ఉంది కాబట్టి ఆ ఫ్లాప్ లో తన ఎకౌంట్ లోనూ పడుతుంది. మొత్తంగా హ్యాట్రిక్ ఫ్లాపులు వచ్చాయనే ఈ ఐటమ్ సాంగ్ కూడా చెప్పిందనే వారూ ఉన్నారు.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఎఫ్3లో పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ చేసింది. ఈ పాట సినిమాకు హైలెట్ అవుతుందంటున్నారు. పైగా ఎఫ్3 బ్యూటీస్ తమన్నా, మెహ్రీన్ లు కూడా బానే స్కిన్ షో చేసినట్టున్నారు. అయినా పూజా వచ్చిందంటే వారి షేర్ తగ్గుతుందని చెప్పలేం. సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ తోనే నిండి ఉంటుంది కాబట్టి.. నవ్వులే ఫైనల్ అవుతాయి కానీ.. ఐటమ్ సాంగ్ మేజర్ షేర్ తీసుకుంటుందనుకోలేం. లైఫ్ అంటే ఇట్లా ఉండాలా అంటూ సాగే ఈ పాటను ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. సినిమా 27న రాబోతోంది. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts