పవన్ కళ్యాణ్ రికార్డ్ చెదరలేదు

ఒకప్పుడు ఒక హీరో కెపాసిటీని నిరూపించింది ఎన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అని. అలాగే ఇంకెన్ని కేంద్రాల్లో యాభై రోజులు ఆ సినిమా ఆడింది అని. యస్.. ఒకప్పుడు శతదినోత్సవ చిత్రం అంటే ఇప్పుడు రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమాలకంటే ఎక్కువగా భావించారు. అందుకే ఎన్ని సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడింది అనే పాయింట్ పైనే ఆయా హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతూ ఉండేవి. ఒక హీరో సినిమా పోస్టర్స్ పై మరో హీరో ఫ్యాన్స్ పేడ చల్లడం, బురద పూయడం వంటివి చేసేవారు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి.. ఆ దరిద్రం అంతా సోషల్ మీడియలోనే పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రికార్డ్స్ అంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనే పాయింట్ దగ్గర ఆగింది. అలా చూస్తే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో హయ్యొస్ట్ అంటే బాహుబలి. ఆ తర్వాతే ఇంకేదైనా. అందుకే కొత్త రికార్డ్స్ అన్నిటినీ నాన్ బాహుబలి రికార్డ్స్ గా కొత్త పేరు కూడా పెట్టేసుకున్నారు. ప్రస్తుతం ఆ రికార్డ్స్ పరంగా అల్లు అర్జున్ ముందున్నాడు అంటే అతిశయోక్తి కాదు. అల వైకుంఠపురములో, పుష్ప చిత్రాలతో చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ ను కొట్టగలిగాడు. బట్ ఒక్కచోట తప్ప.
మాస్ హీరో అంటే ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనే కౌంటే కాదు.. ఎన్ని ప్రీమియర్ షోస్ పడ్డాయి అనేది కూడా కౌంటే. ఆ ప్రీమియర్స్ నుంచి ఎంత కలెక్ట్ చేసింది అనేది కూడా లెక్కే. ఈ విషయంలో ఓవర్శీస్ లో పవన్ కళ్యాణ్ ను ఇప్పటి వరకూ ఎవరూ బీట్ చేయలేకపోయారు. అఫ్ కోర్స్ నాన్ బాహుబలి రికార్డే అనుకోండి. విశేషం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కెరీర్ లనే దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన అజ్ఞాతవాసి ఈ రికార్డ్ ను క్రియేట్ చేయడం. యస్.. అజ్ఞాతవాసి ఓవర్శీస్ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ రికార్డ్ ను ఇప్పటి వరకూ ఎవరూ బీట్ చేయలేదు. ప్రీమియర్స్ కు అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి కలెక్షన్స్ వరకూ ఆ రికార్డ్ నాలుగేళ్లుగా అలాగే ఉండటం విశేషం. ఒకవేళ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఇంక ఏ రేంజ్ లో ఉండేదో కానీ.. పవన్ స్టామినాకు డిజాస్టర్ మూవీ కూడా క్రియేట్ చేసిన ఈ రికార్డ్ ఓ ఎగ్జాంపుల్ మాత్రమే.

Related Posts